Site icon NTV Telugu

US: కోర్టు సంచలన తీర్పు.. గర్భంలో శిశువు మరణించినందుకు మహిళకు 18 ఏళ్ల జైలు శిక్ష

Us

Us

అమెరికాలో ఓ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. గర్భంలో శిశువు మరణించినందుకు ఓ మహిళకు ఏకంగా 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు ఇప్పుడు అగ్ర రాజ్యంంలో సంచలనంగా మారింది. గర్భస్థ శిశువు మరణం కారణంగా తల్లిని ఈ రీతిలో శిక్షించడం ప్రపంచ చరిత్రలో ఇదే తొలిసారి అయి ఉండొచ్చు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy : కొత్త జోనల్‌ కమిషనర్లకు సీఎం రేవంత్‌ దిశానిర్దేశం

అమెరికాలోని అలబామాకు చెందిన బ్రూకర్ షూమేకర్ అనే మహిళ గర్భం దాల్చింది. అయితే 2017లో కడుపులో ఉన్న బిడ్డ మరణించింది. అయితే గర్భధారణ సమయంలో మాదకద్రవ్వాలు ఉపయోగించడం వల్లే బిడ్డ మరణించినట్లుగా ఆమెపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారం న్యాయస్థానానికి చేరింది. అయితే దర్యాప్తులో రసాయనాలు కారణంగానే బిడ్డ చనిపోయినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో మహిళను కోర్టు దోషిగా తేల్చింది. అనంతరం ఆమెకు 18 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది.

ఇది కూడా చదవండి: సాక్షి అగర్వాల్ మ్యాజిక్.. ఈ లుక్ చూసి అందరూ ఫిదా అవ్వాల్సిందే!

అయితే ఈ తీర్పు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. గర్భస్థ శిశువు మృతికి తల్లిని శిక్షించడమేంటి? అని విమర్శలు వస్తున్నాయి. ఇంకోవైపు న్యాయస్థానం తీర్పును మహిళా హక్కుల సంస్థ ప్రెగ్నెన్సీ జస్టిస్ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. మరోవైపు తప్పుడు తీర్పు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి.

గర్భధారణ సమయంలో జరిగే విషాదాలను నేరంగా పరిగణించాలా? వద్దా అనే చర్చ మొదలైంది. శిశువు మరణానికి మహిళలను చట్టబద్ధంగా శిక్షించడం సరైనదేనా? కాదా? అన్న వివాదం జరుగుతోంది. శిశువు మరణం సహజమైనా లేదా మానవ నిర్లక్ష్యం అయినా.. కారణాలు ఏవైనా కావొచ్చని.. కానీ తల్లిని నేరస్థురాలిగా పరిగణించి జైల్లో పెట్టడం ఎంత వరకు సమంజసం అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version