Site icon NTV Telugu

Nupur Sharma: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలను ఖండించిన అమెరికా

Nupur Sharma Naveen Jindal

Nupur Sharma Naveen Jindal

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశంలో, అరబ్ దేశాల్లో దుమారమే రేపాయి. ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ ఖతార్, మలేషియా,  సౌదీ అరేబియా, ఇరాన్ మొదలైన అరబ్ దేశాలు భారత్ కు నిరసన తెలిపాాయి.   ఈ వివాదంపై భారత్ కూడా ఘాటుగానే స్పందించింది. వ్యక్తిగత వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించకూడదని ఇతర దేశాలకు సూచించింది.

నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ వ్యాఖ్యలతో ఇండియాలో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. యూపీ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో తీవ్ర హింస చెలరేగింది. యూపీలోని ప్రయాగ్ రాజ్, సహరాన్ పూర్, కాన్పూర్ లో రాళ్లదాడులు జరిగాయి. వెస్ట్ బెంగాల్ హౌరాలో తీవ్రం ఆందోళను చేశారు. రాంచీలో అల్లర్లలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

ఇదిలా ఉంటే తాజాగా నుపుర్ శర్మ, మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలను అగ్రరాజ్యం  అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇద్దరు బీజేపీ అధికారులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని.. పార్టీ వీరిద్దరిని సస్పెండ్ చేయడంతో పాటు ఖండిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నామని యూఎస్ విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ విలేకరులతో అన్నారు. మతం విశ్వాసాలను గౌరవించడం,  మానవహక్కులను భారత్ పెంపొందించాలని అమెరికా వ్యాఖ్యానించింది.

అయితే నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా బీజేపీ వీరిద్దరిని సస్పెండ్ చేసింది. అయితే ఇక్కడితో వివాదం సద్దుమణగ.. నుపుర్ శర్మను అరెస్ట్ చేయాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. అయితే కొంతమంది నుపుర్ శర్మను చంపేస్తామని, తలనరుకుతామని, రేప్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీటిపై ఆమె ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు బెదిరింపులు వస్తున్న కారణంగా తన అడ్రస్ ను బహిరంగ పరచవద్దని మీడియాను నుపుర్ శర్మ కోరారు.

 

 

 

Exit mobile version