USA: పాకిస్తాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తాకింది. పాకిస్తాన్‌లో చమురు నిల్వలు ఉన్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో ప్రకటన చేశాడు. పాకిస్తాన్‌లో బిలియన్ల విలువైన నిల్వలు ఉన్నాయని చెప్పాడు. అయితే, ఇప్పుడు అమెరికా ఇంధన కార్యదర్శి క్రిస్ రైట్, ట్రంప్ వాదనలకు విరుద్ధంగా ప్రకటన చేశారు. పాకిస్తాన్‌లో చమురు నిల్వలను అన్వేషించడంలో అమెరికాకు ఆసక్తి లేనది చెప్పాడు.
క్రిస్ రైట్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌కు పెద్ద దెబ్బగా చూడవచ్చు. పాకిస్తాన్ చమురు నిల్వలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని పెట్టుబడి ప్రణాళిక కన్నా, రాజకీయ వ్యూహంగానే చూడవచ్చు. పాకిస్తాన్ చమురు అన్వేషణ లేదా డెవలప్మెంట్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేదా కార్పొరేట్ ఆసక్తి లేదని రైట్ స్పష్టం చేశారు. గత నెలలో ట్రంప్ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌లో ఉన్న చమురు నిల్వల్లో అమెరికా భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.
