Site icon NTV Telugu

US: వలసలపై దాడులు.. 30 మంది భారతీయుల అరెస్ట్

Usindian

Usindian

అక్రమ వలసలపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అక్రమ వలసలపై దాడులు జరుగుతున్నాయి. అక్రమంగా అమెరికాలోకి ఎవరు ప్రవేశించకుండా సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక తాజా దాడుల్లో 30 మంది భారతీయులను అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Bangladesh: ఉస్మాన్ హాదీని ప్రభుత్వమే చంపింది.. బాధిత సోదరుడు సంచలన ఆరోపణలు

కాలిఫోర్నియాలోని ఇమిగ్రేషన్ చెక్‌ పోస్టుల దగ్గర బోర్డర్‌ పెట్రోల్‌ ఏజెంట్లు 49 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తెలిపింది. వీరిలో 30 మంది భారతీయులు ఉన్నట్లు వెల్లడించింది. వీరిలో కొందరు కమర్షియల్‌ ట్రక్‌ డ్రైవర్‌ లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులు నడుపుతున్నారని, మరికొందరు అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: H-1B Lottery: H-1B వీసా దరఖాస్తుదారులపై మరో పిడుగు.. లాటరీ విధానం రద్దు

ఇటీవల అమెరికాలో ట్రక్కు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ ట్రక్కు డ్రైవర్లకు వర్క్‌ వీసాలు, కమర్షియల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీని నిలిపివేసింది. ప్రస్తుతం వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులను నడుపుతున్న వారిపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 మధ్య సెమీట్రక్కులు నడుపుతున్న 42 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 30 మంది భారత్‌కు చెందినవారు కాగా మిగిలినవారు చైనా, మెక్సికో, రష్యా, తుర్కియే దేశాలకు చెందినవారిగా గుర్తించారు.

Exit mobile version