Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Us Attacks Venezuelan Ship In Caribbean Sea 11 Dead

US-Venezuela: కరేబియన్ సముద్రంలో వెనిజులా నౌకపై అమెరికా దాడి.. 11 మంది మృతి

Published Date :September 3, 2025 , 8:48 am
By Suresh Maddala
  • కరేబియన్ సముద్రంలో వెనిజులా నౌకపై అమెరికా దాడి
  • 11 మంది మృతి చెందినట్లు ట్రంప్ వెల్లడి
US-Venezuela: కరేబియన్ సముద్రంలో వెనిజులా నౌకపై అమెరికా దాడి.. 11 మంది మృతి
  • Follow Us :
  • google news
  • dailyhunt

కరేబియన్ సముద్రంలో వెనిజులా మాదకద్రవ్య నౌకపై అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ దాడిలో 11 మంది మృతి చెందారు. అంతర్జాతీయ జలాల ద్వారా అమెరికా వైపు మాదకద్రవ్యాలను రవాణా చేస్తుండగా ఈ దాడి జరిగింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో సంబంధాలున్న నార్కో టెర్రరిస్టులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని ట్రంప్ అన్నారు. ట్రెన్ డి అరగువా కార్టెల్‌కు చెందిన 11 మంది అనుమానితులను చంపినట్లు మంగళవారం వెల్లడించారు. అమెరికా దళాలకు ఎటువంటి హాని జరగలేదని వెల్లడించారు. అమెరికాలోకి మాదకద్రవ్యాలను తరలించే వారందరికీ ఇదే హెచ్చరిక అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి: Delhi: నేడు ఢిల్లీలో జీఎస్టీ సమావేశం.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు

TDA అని పిలువబడే ట్రెన్ డి అరగువాను విదేశీ ఉగ్రవాద సంస్థగా ట్రంప్ అభివర్ణించారు. ట్రెన్ డి అరగువా సంస్థ నికోలస్ మదురో నియంత్రణలో పనిచేస్తున్న విదేశీ ఉగ్రవాద సంస్థగా ట్రంప్ పేర్కొన్నారు. ఇది సామూహిక హత్యలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, లైంగిక అక్రమ రవాణా, యునైటెడ్ స్టేట్స్, పశ్చిమ అర్ధగోళంలో హింస, ఉగ్రవాద చర్యలకు బాధ్యత వహిస్తుందని ట్రంప్ వివరించారు.

ఇది కూడా చదవండి: Hyderabad Metro: మెట్రో రైలులో గుండె, ఊపిరితిత్తుల తరలింపు.. 45 నిమిషాల్లోనే 2 ఆస్పత్రులకు!

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో స్పందిస్తూ.. తమ ప్రభుత్వంపై అమెరికా సైనిక చర్యను ముమ్మరం చేస్తోందని ఆరోపించారు. సైనిక బెదిరింపు ద్వారా పాలన మార్పును కోరుకుంటోందని మదురో వ్యాఖ్యానించారు. వెనిజులా సాయుధ దళాలు.. ఏదైనా ఘర్షణకు ప్రతిస్పందించడానికి సూపర్ సన్నద్ధంగా ఉందని చెప్పారు.

మదురో అరెస్టుపై అమెరికా 50 మిలియన్ డాలర్ల బహుమతిని ప్రకటించింది. దీంతో ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. కరేబియన్ దీవులు చాలా కాలంగా అమెరికా భద్రతా దళాలు-మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారుల మధ్య ఘర్షణలకు కేంద్రంగా మారింది. అమెరికా కోస్ట్ గార్డ్-చట్ట అమలు సంస్థలు.. రెండూ గతంలో వెనిజులా-పొరుగు దేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్మగ్లర్లతో సముద్రంలో ఘోరమైన ఘర్షణలకు పాల్పడ్డాయి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 11 dead
  • Caribbean Sea
  • US attacks
  • us-military-strike
  • Venezuela coast

తాజావార్తలు

  • Contract Employees: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీ శుభవార్త..

  • GST Collections: జీఎస్‌టీ ఆదాయం జోరు.. మార్చిలో 8.8% వృద్ధి, రూ.2 లక్షల కోట్ల మార్కు

  • UK on Iran War: యుద్ధంతో మాకు సంబంధం లేదు.. ట్రంప్‌ను ధిక్కరించిన బ్రిటన్..

  • PF Interest Hike: ఈపీఎఫ్ఓ వడ్డీ 10 శాతానికి పెంపు..? మంత్రి ఏమన్నారంటే..

  • TCL C8L Mini LED TV: టీసీఎల్ 98, 85-అంగుళాల, మోడళ్లలో కొత్త హై-ఎండ్ మినీ LED టీవీ సిరీస్‌ విడుదల

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions