Site icon NTV Telugu

క‌మ్ముకుంటున్న యుద్ధ‌మేఘాలు: యూర‌ప్‌కు అమెరికా సైన్యం… బెలారస్‌కు ర‌ష్యా సైన్యం

ఉక్రెయిన్‌- ర‌ష్యా మ‌ధ్య నెల‌కొన్న సంక్షోభం రోజురోజుకు పెరిగిపోతున్న‌ది. తాము యుద్ధాన్ని కోరుకోవ‌డం లేద‌ని ర‌ష్యా చెబుతున్నా, అమెరికా మాత్రం ర‌ష్యా చ‌ర్య‌ల‌ను ఖండిస్తూనే ఉన్న‌ది. తాజాగా జ‌ర్మ‌నీకి రెండు వేల మంది సైనికుల‌ను త‌ర‌లించింది. అంతేకాదు, జ‌ర్మ‌నీలో ఉన్న వెయ్యిమంది అమెరికా సైనికుల‌ను ర‌ష్యా స‌మీపంలో ఉన్న రొమేనియాకు త‌ర‌లించింది. మ‌రోవైపు ఫ్రాన్స్ సైతం రొమేనియాకు సైన్యాన్ని త‌ర‌లించేందుకు సిద్ద‌మైంది. ఇప్ప‌టికే డెన్మార్క్ ఎఫ్ 16 విమానాల‌ను రొమేనియా ప్రాంతంలో మోహ‌రించింది. అమెరికా, యూర‌ప్ దేశాలు ర‌ష్యాకు స‌మీపంలోని రొమేనియాలో సైన్యాన్ని మోహ‌రించ‌డంపై ర‌ష్యా మండిప‌డింది. సోవియ‌ట్ యూనియ‌న్ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా అమెరికా, యూర‌ప్ దేశాలు ప్ర‌వ‌ర్తిస్తున్నాయని ర‌ష్యా విమ‌ర్శించింది. ప్ర‌స్తుతం ప్ర‌చ్ఛ‌న్న‌యుద్దం కాలం నాటి ప‌రిస్థితుల‌ను గుర్తుచేస్తున్నాయి.

Read: భార‌త బ‌డ్జెట్‌పై ఐఎంఎఫ్ కీల‌క వ్యాఖ్య‌లు…

అమెరికా, దాని మిత్ర దేశాలు ర‌ష్యాపై దాడికి దిగితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు ర‌ష్యా ప్ర‌క‌టించింది. అమెరికా వాటి మిత్ర‌దేశాల‌కు ధీటుగా ర‌ష్యాకూడా సైన్యాన్ని మోహ‌రించ‌డం మొద‌లుపెట్టింది. ర‌ష్యామిత్ర దేశం బెలార‌స్‌లో భారీగా ర‌ష్యా సైన్యాన్ని మోహ‌రించింది. అంతేకాదు, అత్యాధునిక అయుధాల‌ను ఇప్ప‌టికే బెలార‌స్‌కు త‌ర‌లించింది ర‌ష్యా. జెట్ ఫైట‌ర్లు, బాలిస్టిక్ క్షిప‌ణులు, ఎస్ 400 యుద్ద ట్యాంకుల‌ను ఇప్ప‌టికే బెలార‌స్‌కు త‌ర‌లించింది ర‌ష్యా. దీంతో యూర‌ప్‌, ర‌ష్యా స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఎటు నుంచి ఎవ‌రైనా యుద్ధం మొద‌లుపెడితే దాని ప‌ర్యావ‌సానం ప్ర‌పంచ దేశాలపై ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Exit mobile version