Site icon NTV Telugu

భద్రతా బలగాలు కీలక ఆదేశాలు…కాబూల్ విమానాశ్రయం వదిలి వెళ్లండి…

ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్నాక ప‌రిస్థితులు ఒక్క‌సారిగా మారిపోయాయి.  బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు.  వీలైతే ఎలాగైనా ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఏదోక విమానం ఎక్కి అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డాల‌ని చూస్తున్నారు.  ఇక‌, ఆగ‌స్టు 31 వ‌ర‌కు తాలిబ‌న్లు ఎయిర్‌పోర్టులోని అమెరికా, నాటో ద‌ళాల‌కు డెడ్‌లైన్ విధించారు.  ఆగ‌స్టు 31 లోగా దేశం విడిచి వారంతా వెళ్లిపోవాల‌ని ష‌ర‌తు విధించారు.  అందుకు త‌గ్గ‌ట్టుగానే అమెరికా, నాటో ద‌ళాలు ప్ర‌జ‌ల‌ను త‌ర‌లిస్తున్నాయి.  అయితే, వేల సంఖ్య‌లో కాబూల్ ఎయిర్‌పోర్టుకు కొత్త వ్య‌క్తులు వ‌స్తూనే ఉన్నారు.  ఇప్ప‌టికే ఎయిర్‌పోర్టులో వేలాది మంది ప‌డిగాపులు కాస్తున్నారు.  ఎలాగైనా బ‌య‌ట ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎవ‌రూ కూడా ఎయిర్‌పోర్టు వైపు రావొద్ద‌ని, వీలైతే మ‌రో మార్గం ద్వారా దేశం విడిచి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించాల‌ని అమెరికా, నాటో ద‌ళాలు ఆయా దేశాల ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.  ఎయిర్‌పోర్టులో ఉగ్ర‌ముప్పు పొంచి ఉంద‌నే కీల‌క స‌మాచారం అంద‌టంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఈ విధ‌మైన ప్ర‌క‌ట‌న చేశాయి. అమెరికా, నాటో ద‌ళాల ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌జ‌ల్లో మ‌రింత క‌ల‌వ‌రం మొద‌లైంది.  

Read: విచిత్రం:  బుల్లెట్టు బండి పాట పెడితేనే … ఆ కొండ‌ముచ్చు…

Exit mobile version