Site icon NTV Telugu

Spy Plane: ఉక్రెయిన్ గ‌గ‌న‌త‌లంలో అమెరికా స్పై విమానాలు…

ఉక్రెయిన్‌- ర‌ష్యా స‌రిహ‌ద్దుల్లో ప‌రిస్థితులు చేజారిపోయేలా క‌నిపిస్తున్నాయి. ఎవ‌రెన్ని చెప్పినా త‌గ్గేదిలే ర‌ష్యా చెబుతున్నది. ఉక్రెయిన్ లోని ప్ర‌త్యేక వేర్పాటువాదుల ప్రాంతాల‌ను రెండు స్వ‌తంత్ర దేశాలుగా ర‌ష్యా గుర్తిస్తు డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేసింది. ఉక్రెయిన్‌ను నిర్వీర్యం చేసి పూర్తిగా దానిని ర‌ష్యాలో క‌లుపుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పుతిన్ ఎత్తులు వేస్తున్నారు.

Read: Electric Vehicles: న‌గ‌రంలో బ్యాట‌రీ స్వాపింగ్ స్టేషన్లు…

అయితే, ఉక్రెయిన్‌కు నాటో, యూర‌ప్‌తో పాటు అమెరికా స‌పోర్ట్ చేస్తున్న‌ది. అమెరికా త‌న బ‌ల‌గాల‌ను పోలెండ్‌కు పంపిన సంగ‌తి తెలిసిందే. ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తుగా అమెరికా బ‌ల‌గాలు పోలెండ్‌కు చేరుకున్నాయి. అయితే, నెల రోజుల కాలంలో రెండుసార్లు అమెరికా స్పై విమానాలు బ్లాక్ సీ మీదుగా ఉక్రెయిన్ గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశించాయి. నిఘా కోసం అమెరాకా ఈ స్పై విమానాల‌కు పంపిన‌ట్టు స‌మాచారం. ర‌ష్యా దాడుల‌కు పాల్ప‌డితే దానికి త‌గిన విధంగా స్పందించేందుకు అమెరికా సిద్ద‌మౌతున్న‌ది.

Exit mobile version