Site icon NTV Telugu

మీరు వ్యాక్సిన్ తీసుకోవ‌డం లేదా…ఈ విష‌యాలు తెలుసుకోండి…

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవ‌డం ఒక్క‌టే మార్గం.  వ్యాక్సిన్‌తీసుకోవ‌డం వ‌ల‌న శ‌రీరంలో యాంటీబాడీలు ఉత్ప‌త్తి అవుతాయి.  ఒక‌సారి వ్యాక్సిన్ తీసుకుంటే క‌నీపం ఆరునెల‌ల‌పాటు యాంటీబాడీలో శ‌రీరంలో ఉత్ప‌త్తి అవుతాయి. కానీ, చాలామంది అపోహ‌ల కార‌ణంగా, వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ముందుకు రావ‌డంలేదు.  వ్యాక్సిన్ తీసుకుంటే ఏమైతుందో అనే భ‌యంతో వెన‌క‌డుగు వేస్తున్నారు.  కానీ, టీకాలు తీసుకోక పోవ‌డం వ‌ల‌న వారికే కాకుండా వారి చుట్టు ఉన్న వారికి కూడా ముప్పు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  

Read: రామ్ చ‌ర‌ణ్‌గా అద‌ర‌గొట్టిన డేవిడ్ వార్న‌ర్..

టీకాలు తీసుకోని ప్ర‌జ‌లే కొత్త వేరియంట్ల పుట్టుక‌కు కార‌ణం అవుతున్నార‌ని అమెరికాలోని వ్యాండ‌ర్‌బిల్డ్ విశ్వ‌విద్యాల‌యం ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు.  టీకాలు తీసుకోని వారి సంఖ్య‌పై ఆధార‌ప‌డి వైర‌స్ వ్యాప్తి ఉంటుంద‌ని, వ్యాక్సిన్లు తీసుకోనివారు అధిక‌సంఖ్య‌లో ఉంటే, వైర‌స్ వ్యాప్తి రెట్టింపుస్థాయిలో ఉంటుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందితే, అంతే వేగంగా మ్యూటేష‌న్లు పెరుగుతాయ‌ని, ఫ‌లితంగా ముప్పు మ‌రింతగా ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.  

Exit mobile version