Site icon NTV Telugu

US: యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో టెక్నాలజీ సమస్య.. నిలిచిన విమాన సేవలు

Us

Us

అగ్రరాజ్యం అమెరికాలో విమాన సేవలు నిలిచిపోయాయి. టెక్నాలజీ సమస్య కారణంగా యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సేవలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి నిరీక్షణతో విసుగు చెందుతున్నారు.

ఇది కూడా చదవండి: Vizag: ఆరుగురు ప్రతివ్రతలు అరెస్ట్.. పేకాట ఆడుతున్న భార్యపై ఫిర్యాదుతో గుట్టురట్టు!

టెక్నాలజీ సమస్య కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ.. విమానాశ్రయాలకు గ్రౌండ్ స్టాప్‌లను జారీ చేసింది. మరికొన్ని గంటల పాటు విమాన సర్వీసుల్లో అంతరాయం ఉంటుందని.. ప్రయాణికులు అర్థం చేసుకోవాలని కోరింది. భద్రత మా ప్రధాన ప్రాధాన్యత అని.. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇది కూడా చదవండి: Telangana Rains: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు!

ప్రస్తుతం చికాగో, డెన్వర్, న్యూవార్క్, హ్యూస్టన్, శాన్‌ఫ్రాన్సిస్కోతో సహా ప్రధాన విమానాశ్రాయాల్లో ప్రయాణికులు తీవ్ర అంతరాయం ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే విమాన రాకపోకల్లో అంతరాయం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమయానికి గమస్థానాలకు చేరకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

Exit mobile version