Site icon NTV Telugu

US Video: తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఊడిపోయిన ముందు చక్రం

Us

Us

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండింగ్ అవుతుండగా ముందు చక్రం ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో విమానం కొద్దిదూరం నేలకు రాసుకుంటూ వెళ్లి ఆగిపోయింది. ఈ క్రమంలో పొగలు కమ్ముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆపి ప్రయాణికులను సురక్షితంగా రక్షించారు.

ఇది కూడా చదవండి: Vijay: మరోసారి సీబీఐ ముందు హాజరైన విజయ్.. ఎన్నికల వేళ ఏం జరుగుతోంది?

చికాగోలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓర్లాండోకు 200 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో విమానం బయల్దేరింది. అయితే ఓర్లాండో‌లో విమానం ల్యాండింగ్ అవుతుండగా గేరింగ్ నుంచి ముందు చక్కం ఊడిపోయింది. అయితే విమానం ముందుకు వెళ్లి ఆగిపోయింది. అనంతరం ఎమర్జెన్సీ ద్వారాల నుంచి ప్రయాణికులు దిగిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని.. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అనంతరం ప్రయాణికులను బస్సులోకి ఎక్కించుకుని బయటకు తీసుకెళ్లారు. ఇక ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Trump-Iran: ఖమేనీపై దాడి చేస్తే ఖబడ్దార్.. పూర్తి స్థాయి యుద్ధానికి దిగుతామని ఇరాన్ వార్నింగ్

అయితే చక్రం ఊడిపోవడం వెనుక గాలులతో కూడిన వాతావరణమే కారణమై ఉండొచ్చని అంచనాకు వస్తున్నారు. ఇక ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో గంటకు 54 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సమీపంలోని ఓర్లాండో ఎగ్జిక్యూటివ్ విమానాశ్రయంలో గంటకు 56 కి.మీ వేగంతో గాలులు వీచినట్లుగా నివేదికలు అందుతున్నాయి. ఫ్లోరిడా తూర్పు తీరం వెంబడి బ్రెవార్డ్ కౌంటీలోని అనేక ప్రాంతాలకు జాతీయ వాతావరణ శాఖ తీవ్ర గాలి హెచ్చరికలు జారీ చేసింది.

 

Exit mobile version