Site icon NTV Telugu

UN: ఐక్యరాజ్యసమితిలో “లేఆఫ్స్”.. 7000 ఉద్యోగాల తొలగింపు..!

Un

Un

UN: ‘‘లే ఆఫ్స్’’ కేవలం ఐటీ, ఇతర పరిశ్రమలకు పరిమితం కాలేదు. తాజాగా, ఐక్యరాజ్యసమితి కూడా తన ఉద్యోగులకు తొలగించే పనిలో ఉంది. గత కొన్నేళ్ళ కాలంగా, ముఖ్యంగా ఐటీ పరిశ్రమల్లో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. ఆర్థిక సంక్షోభం, ఆదాయం తగ్గడం, ఏఐ విస్తృత స్థాయి వినియోగం కారణంగా చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఇలాంటి ఆర్థిక సమస్యలతోనే యూఎన్ బాధపడుతోంది.

Read Also: Rajat Patidar: సంబరాలు చేసుకుందాం, సిద్ధమా.. ఆర్సీబీ అభిమానులకు పాటీదార్ సందేశం!

యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్ తన $3.7 బిలియన్ల బడ్జెట్‌ను 20% తగ్గించేందుకు సిద్ధమవుతోందని, దాదాపుగా 6900 ఉద్యోగులను తొలగిచేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. జూన్ 13 నాటికి వీరిని తొలగించాలని ప్లాన్ చేస్తోంది. అమెరికా ప్రతీ ఏటా ఐక్యరాజ్యసమితికి ఇచ్చే నిధుల్లో కోత విధించింది. అమెరికానే యూఎన్‌కి పావువంతు నిధులను సమకూరుస్తోంది.

ట్రంప్ హాయంలో అంమెరికా విదేశీ సహాయ కోతలు ఐక్యరాజ్యసమితి మానవతా సంస్థలను దెబ్బతీశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికా దాదాపు 1.5 బిలియన్లు చెల్లించాల్సి ఉంది. ఐక్యరాజ్యసమితి కంట్రోలర్ చంద్రమౌళి రామనాథన్ అమెరికా చెల్లింపుల వైఫల్యాలను ప్రస్తావించనప్పటికీ, 21వ శతాబ్ధంలో ప్రజలకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వడానికి యూఎన్‌కి సహకారం అవసరమని ఆయన అన్నారు.

Exit mobile version