US: అమెరికాలో దారుణం.. రైల్లో ఉక్రెయిన్ శరణార్థి హత్య
- అమెరికాలో దారుణం
- రైల్లో ఉక్రెయిన్ శరణార్థి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. రైల్లో ప్రయాణిస్తున్న ఉక్రెయిన్ శరణార్థిని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి దుండగుడు చంపేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగుకి వచ్చాయి.
ఇది కూడా చదవండి: Vice President Election 2025: రేపు భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక.. సీక్రెట్ బ్యాలట్ విధానంలో..
Also Read
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
- UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
23 ఏళ్ల ఇరినా జరుట్స్కా అనే ఉక్రెయిన్ మహిళ.. యుద్ధ భయంతో అమెరికాకు వచ్చి స్థిరపడాలని భావించింది. కానీ దురదృష్టవశాత్తు దుండగుడి చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఆగస్టు 22న రాత్రి 9:46 గంటలకు లైట్ రైల్ ఎక్కి ఫోన్‌లో నిమగ్నమైంది. ఆమె వెనుకనే కూర్చున్న 34 ఏళ్ల డెకార్లోస్ బ్రౌన్ అనే దుండగడు మడతపెట్టే కత్తిని తీసుకుని మెడపై మూడుసార్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావం జరగడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం దుండగుడు రక్తం కారుతున్న కత్తితోనే దిగిపోయాడు. ప్రయాణికులు కూడా రక్తం కారుతున్న దృశ్యాలను గమనిస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇందుకు సంబందించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : సీఎం రేవంత్‌తో ఫిరాయించిన ఎమ్మెల్యేల భేటీ.. కడియం శ్రీహరి గైర్హాజరు
నిందితుడు డెకార్లోస్ బ్రౌన్.. 2011 నుంచి విస్తృతమైన నేర చరిత్ర కలిగిన వాడు. దొంగతనం, ప్రమాదకరమైన ఆయుధంతో దోపిడీ, బెదిరింపులకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఓ భయంకరమైన సంఘటనలో ఐదేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇక రైల్లో హత్య తర్వాత తదుపరి స్టేషన్‌లో బ్రౌన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. చేతి మీద గాయంతో ఆస్పత్రిలో చికిత్స కూడా పొందాడు. ఫస్ట్ డిగ్రీ హత్య అభియోగం మోపినట్లు పోలీసులు తెలిపారు. అయితే దాడికి గల కారణాలను మాత్రం పోలీసులు ఛేదించలేకపోయారు. బాధితురాలు రైల్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.
This heartbreaking video shows the tragic moment Iryna Zarutska was stabbed to death on a Charlotte train. We must prioritize safety and support for refugees. Reopen asylum programs to prevent more tragedies. #Charlotte #Refugees #GunViolence #PublicSafety pic.twitter.com/6mWZL4qHFQ
— ceanpolitics (@ceanglobal) September 6, 2025
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!