Site icon NTV Telugu

US: అమెరికాలో దారుణం.. రైల్లో ఉక్రెయిన్ శరణార్థి హత్య

Usmurder

Usmurder

అగ్ర రాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. రైల్లో ప్రయాణిస్తున్న ఉక్రెయిన్ శరణార్థిని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి దుండగుడు చంపేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆలస్యంగా వెలుగుకి వచ్చాయి.

ఇది కూడా చదవండి: Vice President Election 2025: రేపు భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక.. సీక్రెట్ బ్యాలట్ విధానంలో..

23 ఏళ్ల ఇరినా జరుట్స్కా అనే ఉక్రెయిన్ మహిళ.. యుద్ధ భయంతో అమెరికాకు వచ్చి స్థిరపడాలని భావించింది. కానీ దురదృష్టవశాత్తు దుండగుడి చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఆగస్టు 22న రాత్రి 9:46 గంటలకు లైట్ రైల్ ఎక్కి ఫోన్‌లో నిమగ్నమైంది. ఆమె వెనుకనే కూర్చున్న 34 ఏళ్ల డెకార్లోస్ బ్రౌన్ అనే దుండగడు మడతపెట్టే కత్తిని తీసుకుని మెడపై మూడుసార్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావం జరగడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం దుండగుడు రక్తం కారుతున్న కత్తితోనే దిగిపోయాడు. ప్రయాణికులు కూడా రక్తం కారుతున్న దృశ్యాలను గమనిస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇందుకు సంబందించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy : సీఎం రేవంత్‌తో ఫిరాయించిన ఎమ్మెల్యేల భేటీ.. కడియం శ్రీహరి గైర్హాజరు

నిందితుడు డెకార్లోస్ బ్రౌన్.. 2011 నుంచి విస్తృతమైన నేర చరిత్ర కలిగిన వాడు. దొంగతనం, ప్రమాదకరమైన ఆయుధంతో దోపిడీ, బెదిరింపులకు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఓ భయంకరమైన సంఘటనలో ఐదేళ్ల జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఇక రైల్లో హత్య తర్వాత తదుపరి స్టేషన్‌లో బ్రౌన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. చేతి మీద గాయంతో ఆస్పత్రిలో చికిత్స కూడా పొందాడు. ఫస్ట్ డిగ్రీ హత్య అభియోగం మోపినట్లు పోలీసులు తెలిపారు. అయితే దాడికి గల కారణాలను మాత్రం పోలీసులు ఛేదించలేకపోయారు. బాధితురాలు రైల్లోనే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

 

Exit mobile version