NTV Telugu Site icon

Ukraine War: విజయం సాధించే వరకు పోరాడుతూనే ఉంటాం.. జెలన్ స్కీ న్యూఇయర్ సందేశం

Zelensky

Zelensky

Ukraine Will Fight Russia Until Victory says Zelensky In New Year Address: ఉక్రెయిన్ విజయం సాధించే వరకు రష్యాతో పోరాడుతూనే ఉంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలన్ స్కీ ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యుద్ధంలో పాల్గొని మరణించిన ఉక్రెయిన్ సైనికులకు నివాళులు అర్పించారు. ‘‘మేము విజయం కోసం పోరాడుతాం.. పోరాడుతూనే ఉంటాం’’ అంటూ భావోద్వేగ ప్రసంగం చేశారు. రష్యా, ఉక్రెయిన్ పై భీకరదాడులు నిర్వహించిన కొన్ని గంటల్లోనే జెలన్ స్కీ తన ప్రకటనను వెల్లడించారు. యుద్ధంలో పాల్గొంటున్న వారందరిని ప్రశంసించారు.

Read Also: Road Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఉక్రెయిన్లు చాలా దైర్యవంతులని.. మేము ఏమి చేశామో.. ఏం చేయబోతున్నామో చూడండి అని అన్నారు. మన సైనికులు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సైన్యంతో పోరాడుతున్నారని అని వెల్లడించారు. మా ప్రజలు రష్యాను నిలువరించారని.. గొప్ప యుద్ధంలో చిన్న విషయాలు లేవని ఆయన అన్నారు. మనలో ప్రతీ ఒక్కరూ పోరాట యోధులే అని జెలన్స్కీ అన్నారు.

గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభం అయిన రష్యా-ఉక్రెయిన్ వార్ గత 10 నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇప్పటికీ వేల మంది సైనికులు చనిపోయారు. ఇరు వైపులా ప్రాణనష్టం సంభవించింది. అయితే రష్యా చర్చలపై సానుకూలత వ్యక్తం చేసినా.. ఉక్రెయిన్ మాత్రం పుతిన్ రష్యా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం చర్చలకు ఆస్కారమే లేదని ప్రకటించింది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ భవిష్యత్తులో రష్యాతో యుద్ధాన్ని కొనసాగించేలానే కనిపిస్తోంది. ఇటీవల అమెరికా వెళ్లి వచ్చిన జెలన్ స్కీ ఆయుధాలు, ఆర్థిక సాయాన్ని పొందనున్నారు. అత్యాధునిక పెట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థను అమెరికా, ఉక్రెయిన్ కు ఇస్తోంది.

Show comments