Site icon NTV Telugu

Ukraine Crisis: ఒంట‌రిగా మిగిలిపోయాం… ఉక్రెయిన్ అధ్య‌క్షుడి ఆవేద‌న‌…

ర‌ష్యాను నిలువ‌రిస్తామ‌ని, ఉక్రెయిన్‌కు అండ‌గా ఉంటామని నాటో దేశాలు, అమెరికా మొద‌టి నుంచి చెబుతూ వ‌స్తున్న‌ది. ఉక్రెయిన్ కోసం నాటో ద‌ళాల‌ను స‌రిహ‌ద్దుల‌కు త‌ర‌లించి చాలా రోజులైంది. కానీ ఆ ద‌ళాలు ఉక్రెయిన్‌లోకి ఎంట‌ర్ కాలేదు. అమెరికా సైతం త‌మ బ‌ల‌గాల‌ను పోలెండ్‌కు త‌ర‌లించింది. అయితే, ర‌ష్యాతో నేరుగా యుద్ధం చేయ‌బోమ‌ని, ఉక్రెయిన్‌కు అవ‌స‌ర‌మైన స‌హ‌కారం మాత్ర‌మే చేస్తామ‌ని చెబుతూ వ‌చ్చింది. నాటో, అమెరికా దేశాలు అండ‌గా ఉంటాయని అనుకున్న ఉక్రెయిన్‌కు భంగ‌పాటే మిగిలింది. యుద్ధం వ‌చ్చే స‌రికి నాటో ద‌ళాలు ఒక్క అడుగుకూడా ముందుకు వేయ‌డం లేదు, అటు అమెరికా సైతం చూస్తుండిపోయింది మినహా ముందుకు వ‌చ్చి ర‌ష్యాను నిలువ‌రించ‌లేదు.

Read: Viral: ఆమె స్టెప్పుల‌కు నెటిజ‌న్లు ఫిదా…

దీంతో ప‌శ్చిమ దేశాల‌పై ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెస్కీ అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ప్ర‌పంచ దేశాలు త‌మను ఒంట‌రిని చేశాయ‌ని అన్నారు. త‌మకు చేత‌నైన వ‌ర‌కు పోరాటం చేస్తామ‌ని అన్నారు. ప్ర‌జ‌లు సైతం త‌మ దేశం కోసం పోరాటం చేసేందుకు ముందుకు వ‌స్తున్న త‌రుణంలో ఎంత వ‌రకు పోరాటం చేయ‌గ‌లరు అన్న‌ది చూడాలి. అయితే, ర‌ష్యా సైన్యం ఉక్రెయిన్ రాజ‌ధానిలోకి ప్ర‌వేశించ‌డంతో పాటు, అధ్య‌క్షుడి భ‌వ‌నంపై దాడి చేసేందుకు ర‌ష్యా గెరిల్లా సైన్యం రంగంలోకి దిగిన‌ట్టు స‌మాచారం. దీంతో త‌మ అధ్య‌క్షుడిని ర‌క్షించుకునేందుకు ఉక్రెయిన్ ఆర్మీ జెలెస్కీని బంక‌ర్‌లోకి తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం.

Exit mobile version