NTV Telugu Site icon

Russia Ukraine War: ఒంటరై పోయామంటూ అధ్యక్షుడి ఆవేదన

రష్యా భూతలం, గగనతంల అనే తేడాలేకుండా.. అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతోంది.. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించినా.. ఆ దేశానికి సంబంధించిన ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నా.. ఆ దేశానికి చెందిన ప్రముఖుల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసినా.. యుద్ధ రంగంలోమాత్రం రష్యా దూసుకుపోతూనే ఉంది.. రెండో రోజూ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను టార్గెట్‌ చేసింది రష్యా.. అయితే, ర‌ష్యాతో జ‌రుగుతున్న పోరాటంలో తాము ఒంట‌రిగా మిగిలిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. రష్యా తమపై దాడికి పూనుకుంటే.. ప్రపంచ దేశాల సాయం అందుతుంద‌ని భావించాం.. కానీ, అలాంటిదేమీ జ‌ర‌గ‌లేద‌ని వాపోయారు. స్వాతంత్ర్య పోరాటంలో తాము ఒంట‌రిగా మిగిలామని పేర్కొన్నారు.

Read Also: Bheemla Nayak: యానాంకు పవన్‌ ఫ్యాన్స్‌ క్యూ..

అసలు మీరు ఉక్రెయిన్‌తో ఉన్నారా? లేదా? అంటూ తమ మిత్రదేశాలను ప్రశ్నించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ఒక వేళ త‌మ‌కు మ‌ద్దతుగా ఉంటే నాటో కూట‌మిలోకి మ‌మ్మల్ని తీసుకోవ‌డానికి ఎందుకు సిద్ధంగా లేరు అంటూ నిలదీశారు.. మా దేశ భ‌ద్రత హామీల గురించి మాట్లాడేందుకు ఎప్పుడూ భయపడేదిలేదన్న ఆయన.. కానీ, త‌మ దేశ ర‌క్షణ మాటేమిటి? అంటూ ప్రశ్నించారు.. ఆ హామీని ఏ దేశాలు త‌మ‌కు అందిస్తాయో ఎదురుచూస్తున్నాం అన్నారు.. మరోవైపు సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని రష్యా చెబుతున్నా.. ప్రజలపై కూడా దాడులు జరుగుతున్నాయని జెలెన్‌స్కీ పేర్కొన్నారు..