Site icon NTV Telugu

Ukraine Crisis: ర‌ష్యాతో ఉక్రెయిన్ బ్రేక‌ప్‌… నిలిచిపోయిన నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్ ప్రాజెక్ట్‌…

ర‌ష్యా ఉక్రెయిన్ మ‌ధ్య ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారాయి. ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాల‌ను స్వ‌తంత్ర దేశాలుగా గుర్తిస్తూ ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయ‌డంతో ప‌రిస్థితులు దిగ‌జారాయి. ర‌ష్యాతో ఉన్న అన్ని ర‌కాల సంబంధాల‌ను ఉక్రెయిన్ తెగ‌తెంపులు చేసేసుకున్న‌ది. రెండు స్వ‌తంత్ర దేశాల‌ల్లో శాంతిని ప‌రిర‌క్షించ‌డం కోసం ర‌ష్యా త‌న సైన్యాన్ని ఆ రెండు దేశాల‌కు పంపింది. ప‌దేళ్ల‌పాటు రెండు దేశాల్లో ర‌ష్యా ద‌ళాలు ఉంటాయి. స్వ‌తంత్ర ప్రాంతాల‌తో పాటు ర‌ష్యా ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్ర‌మించుకుంటుంద‌నే సంకేతాలు వెలువ‌డుతున్న నేప‌థ్యంలో జ‌ర్మ‌నీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ర‌ష్యా ఉంచి జ‌ర్మనీ మీదుగా యూర‌ప్ దేశాల‌కు ఏర్పాటు చేసిన నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ 2ను నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అటు యూర‌ప్ స‌మాఖ్య సైతం ఆంక్ష‌లు విధించేందుకు సిద్ద‌మైంది. అమెరికా కూడా ఆంక్ష‌లు సిద్దం చేస్తున్న‌ది. ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా ర‌ష్యా ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.

Read: Mars: మార్స్ పై వింత వ‌స్తువు…

Exit mobile version