NTV Telugu Site icon

Ukraine in Top: నమ్మబుద్ధి కాని నిజం. టాప్‌లో నిలిచిన ఉక్రెయిన్‌.

Ukraine In Top

Ukraine In Top

Ukraine in Top: రష్యా దురాక్రమణతో సర్వం కోల్పోయిన ఉక్రెయిన్‌ టాప్‌లో నిలవటమేంటి, అసలు ఆ దేశం ఎందులో టాప్‌లో నిలిచిందని అనుకుంటున్నారా?. నమ్మబుద్ధి కాని నిజమిది. డిజిటల్‌ కరెన్సీలో ఉక్రెయిన్‌ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించింది. 2021లో ఆ దేశంలో 12.7 శాతం మంది వద్ద ఇ-నగదు ఉంది. దీంతో ఈ డిజిటల్‌ కరెన్సీ కలిగిన టాప్‌-20 ఎకానమీల్లో ఉక్రెయిన్‌ అగ్రస్థానాన్ని ఆక్రమించింది.

మన దేశంలో మాత్రం 7 శాతం మంది వద్దే క్రిప్టో కరెన్సీ ఉంది. ఐక్య రాజ్య సమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (యూఎన్‌సీటీఏడీ) ఈ వివరాలను వెల్లడించింది. కొవిడ్‌ సమయంలో క్రిప్టో కరెన్సీ వినియోగం భారీగా పెరిగినట్లు తెలిపింది. అయితే.. ఈ నగదు వల్ల రివార్డులే కాదు రిస్కూ ఎక్కువేనని హెచ్చరించింది.

One Nation-One Examination: ఒకే దేశం-ఒకే పరీక్ష. నీట్, జేఈఈని కలిపి సీయూఈటీని నిర్వహించనున్న యూజీసీ

దివిస్‌ లాభాలు అదుర్స్‌

దివిస్‌ ల్యాబొరేటరీస్‌ రూ.702 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏప్రిల్‌, మే, జూన్‌ త్రైమాసిక ఫలితాలను ఇవాళ వెల్లడించింది. 2021 తొలి త్రైమాసికంలో నెట్‌ ప్రాఫిట్‌ రూ.557 కోట్లే రాగా ఈ ఏడాది లాభం 26 శాతం పెరిగింది. దీంతో మొత్తం సమగ్ర ఆదాయం రూ.2343 కోట్లకు చేరింది. రూ.650 కోట్లే ప్రాఫిట్‌ వస్తుందన్న మార్కెట్‌ వర్గాల ముందస్తు అంచనాలను మించి రాణించటం విశేషం.

‘డాబర్‌’ చైర్మన్‌ రాజీనామా

డాబర్‌ ఇండియా లిమిటెడ్‌ చైర్మన్‌ అమిత్‌ బర్మన్‌ రిజైన్‌ చేశారు. దీంతో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మోహిత్‌ బర్మన్‌ను నియమించారు. ఈయన ప్రస్తుతం నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌గా ఉన్నారు. కొత్త పదవిలో ఐదేళ్ల వరకు కొనసాగుతారు. అయితే అమిత్‌ బర్మన్‌ మాత్రం ఎఫ్‌ఎంసీజీ కంపెనీకి నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కంటిన్యూ అవుతారు. ఈ మార్పులు, చేర్పులకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ అంగీకరించినట్లు సంస్థ వెల్లడించింది. డాబర్‌ ఇండియా లిమిటెడ్‌కి అమిత్‌ బర్మన్‌ 2019 నుంచి చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

లీటర్‌కి రూ.4 అదనం

రాష్ట్రంలోని డెయిరీ రైతులకు లీటర్‌ పాలకి రూ.4 అదనంగా చెల్లిస్తామని కేరళ పశుసంవర్ధక శాఖ మంత్రి చించురాణి చెప్పారు. జులైలోనే ప్రారంభించిన ఈ చెల్లింపులను 2023 మార్చి వరకు కొనసాగిస్తామని తెలిపారు. పాల ధరలను పెంచే పరిస్థితి లేకపోవటం వల్ల ఈ పేమెంట్ల కోసం రూ.28 కోట్లను ప్రత్యేకంగా కేటాయించినట్లు వివరించారు.

స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌

స్టాక్‌ మార్కెట్లలో నిన్నటి భారీ లాభాలకు ఇవాళ ఉదయం బ్రేక్‌ పడింది. దీంతో నష్టాలతో ప్రారంభమై లాభాల్లోకి వచ్చాయి. ప్రస్తుతం 131 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ 59463 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. 48 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 17707 వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. రూపాయి మారకం విలువ కాస్త పుంజుకుంది. 79.20 వద్ద నిలకడగా ఉంది. రియాల్టీ స్టాక్స్‌ లాభాలను ఆర్జించగా ఐటీ సంస్థల షేర్లు మొదట్లో నష్టాల్లో ఉన్నాయి.