NTV Telugu Site icon

Ukraine Crisis Ukraine Crisis: దారుణం.. సమాధులు తవ్వుతున్న ప్రజలు

Ukraine Crisis Ukraine Crisis

Ukraine Crisis Ukraine Crisis

ఉక్రెయిన్‌ -రష్యా యుద్ధం తీవ్ర దశలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. అక్కడి ప్రజలకు ఎప్పుడు ఎక్కడినుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని ఆ భయానక పరిస్థితుల్లో, అనేక మంది తమవారికి సక్రమంగా తుది వీడ్కోలు పలకలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోయారు. ఈనేపథ్యంలో.. ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగుపడటం వల్ల లుహాన్స్క్‌ రీజియన్‌లోని రూబిజ్నే పట్టణ ప్రజలు యుద్ధం తారస్థాయిలో ఉన్నప్పుడు హడావుడిగా మృతదేహాలను ఖననం చేయించారు. ఇప్పుడు ఆ మృతదేహాలను వెలికితీస్తున్నారట. ఆ మృతదేహాలను మళ్లీ వాటికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. అక్కడ దాదాపు 50 వేల జనాభా ఉన్న ఈ పట్టణం ప్రస్తుతం రష్యా మద్దతుకలిగిన లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ (ఎల్‌పీఆర్‌) ఆధీనంలో ఉంది.

ఉక్రెయిన్‌ -రష్యా యుద్ధ సమయంలో ధ్వంసమైన ఓ అపార్ట్‌మెంట్ బ్లాక్ వెలుపల ఇటీవల ఓ కందకాన్ని (గుంతను) తిరిగి తవ్వారు. దానిలోంచి ఆరు మృతదేహాలను వెలికితీశారు. దీంతో లిలియా అనే స్థానికురాలు తన తల్లి మృతదేహానికి చుట్టిన దుప్పటి ఆధారంగా ఆమెను గుర్తుపట్టారు. యుద్ధ దాడుల సమయంలో 10 రోజులపాటు తన తల్లిదండ్రుల అపార్ట్‌మెంట్‌కు చేరుకోలేకపోయానని, ఆమె అప్పటికే మరణానికి చేరువైందని, చేతులు నీలి రంగులోకి మారాయని, ముఖం వాడిపోయిందని, మరుసటి రోజే ఆమె మరణించిందని ఆమె కన్నీరుపెట్టుకున్నారు. ఈనేపథ్యంలో.. ఎడతెగని దాడులతో అంత్యక్రియలు సరిగ్గా నిర్వహించలేని దుస్థితి ఏర్పడిందని భావోద్వేగానికి గురైంది. ఆపరిస్థితుల్లోనే తన తల్లి మృతదేహాన్ని బహిరంగ కందకంలో ఖననం చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే.. ఇప్పుడు ఆమె మృతదేహాన్ని శ్మశానవాటికలో పూడ్చుతాఅని వివరించారు.

దీంతో తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా మద్దతుగల లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రస్తుతం మృతదేహాల వెలికితీత ప్రక్రియ కొనసాగుతుంది. ఈసందర్భంగా.. ఎల్‌పీఆర్ అధికారి అన్నా సోరోకినా మాట్లాడుతూ ఇటీవల ఒక బృందం రూబిజ్నేలో 10 రోజుల వ్యవధిలో 104 మృతదేహాలను వెలికితీసినట్లు, ఇలా నగరంలో దాదాపు 500 వరకు సామూహిక సమాధులు ఉన్నట్లు అంచనా వేశారు. కాగా.. ఇప్పటివరకు బయటపడిన మృతదేహాలకు చాలావరకు క్షిపణి.. బాంబు దాడుల గాయాలున్నాయని తెలిపారు. కొన్నింటికి బుల్లెట్ గాయాలు కూడా ఉన్నాయని, మరొకొన్ని గుర్తుతెలియని మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్‌ఏ నమూనాలు సేకరిస్తున్నట్లు అన్నా సోరోకినా వెల్లడించారు.
Vijayendra Prasad: ‘బాహుబలి’ రచయితనే స్టార్ హీరోలు పక్కన పెట్టేస్తున్నారట..?