ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూ గడగడలాడిస్తోంది. ఉక్రెయిన్ సైనిక దళాలు కూడా రష్యాతో తలపడుతున్నాయి. అయితే ఇప్పటికే రెండుసార్లు యుద్ధం ఆపాలని రష్యాతో ఉక్రెయిన్ చర్చలకు దిగింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి రష్యాతో చర్చలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ దేశంలోని పలు కీలక నగరాలు రష్యా స్వాధీనంలోకి వెళ్లాయి. ఇరు దేశాల మధ్య జరిగిన రెండు దఫాల చర్చలు ఫలితాలనివ్వలేదు. ఈ క్రమంలో రష్యాతో మూడో సారి చర్చలకు ఉక్రెయిన్ సన్నాహాలు చేస్తోంది. ఈ తరుణంలో ఉక్రెయిన్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారి తీసింది.
తమ దేశంలోని ఖార్కివ్ నగరంలో బందీలుగా 3189 భారతీయులను, 2700 వియత్నామీలను, 202 మంది చైనీయులను బందీలుగా ఉక్రెయిన్ ఉంచుకుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరో నగరమైన సుమీలో 576 మంది భారతీయులు, 101 ఘనా వాసులు, 121మంది చైనీయులు బందీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ దేశంలో ఇతర దేశాల ప్రజలు ఉంటే రష్యా దాడులకు వెనుకంజ వేస్తుందనే ఆలోచనలతోనే ఇలా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
