Site icon NTV Telugu

Russia-Ukraine War: రష్యాపై ఉక్రెయిన్‌ భారీ దాడి.. 144 డ్రోన్లతో ఎటాక్

Russiaukraine War

Russiaukraine War

రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండేళ్ల నుంచి యుద్ధం సాగుతోంది. ఒకరిపై ఒకరు ప్రతీకార దాడులు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ దాడికి పాల్పడింది. తొమ్మిది వేర్వేరు రష్యన్ ప్రాంతాలలో 144 డ్రోన్‌లను ప్రయోగించింది. మాస్కోలో 20 డ్రోన్లతో దాడి చేసింది. దీంతో డజన్ల కొద్దీ విమాన సర్వీసులు కూడా రద్దు అయ్యాయి. అనేక ప్రధాన విమానాశ్రయాల్లో కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. ఈ దాడిలో ఒక మహిళ మరణించగా.. డజన్ల కొద్దీ ఇళ్లు దెబ్బతిన్నాయి.

ఇది కూడా చదవండి: Devara: దేవర ట్రైలర్ రివ్యూ.. ఇదేంటి ఆ సినిమాలు గుర్తొస్తున్నాయ్?

తమ భూభాగంలోకి ప్రవేశించిన 144 డ్రోన్లను రాత్రికి రాత్రే కూల్చివేశామని రష్యా రక్షణశాఖ అధికారులు మంగళవారం వెల్లడించారు. బ్రయాన్స్క్ ప్రాంతంపై 72, మాస్కో ప్రాంతంపై 20, కుర్స్క్ ప్రాంతంపై 14, తులా ప్రాంతంపై 13, దేశంలోని మరో ఐదు ప్రాంతాలపై 25 ప్రయోగించిన డ్రోన్ల కూల్చివేశామని రష్యా సైన్యం తెలిపింది. ఉక్రెయిన్‌ చేసిన భారీ వైమానిక దాడుల్లో మాస్కోలో ఒక మహళ మృతి చెందినట్లు మాస్కో ప్రాంతీయ గవర్నర్ ఆండ్రీ వోరోబయోవ్ వెల్లడించారు. దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Haryana Polls: పోటీ నుంచి తప్పుకున్న బీజేపీ అభ్యర్థి.. కారణమిదే..!

Exit mobile version