Covid 19: సుదీర్ఘకాలం కరోనాతో పోరాటం.. 411 రోజుల తర్వాత కోలుకున్న వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK Researchers Cure Man Who Had Covid For 411 Days: రెండున్నరేళ్ల నుంచి ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో అల్లాడుతోంది. అనేక దేశాలు వ్యాక్సిన్లను తయారు చేసినా కూడా తన రూపాలను మార్చుకుంటూ ప్రజలపై దాడి చేస్తూనే ఉంది. ఇప్పటికే ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టానా.. ముప్పు మాత్రం ఇంకా తప్పిపోలేదు. కరోనా వల్ల చాలా కుటుంబాలు, పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. లక్షల్లో ప్రజలు మరణించారు.
ఇదిలా ఉంటే యూకేలో ఓ రోగి సుదీర్ఘకాలం పాటు కరోనాతో పోరాడాడు. ఏకంగా 411 రోజుల తర్వాత కరోనా నుంచి కోలుకున్నాడు. ఇంత కాలం పాటు కోవిడ్ కు చికిత్స తీసుకుంటున్న వ్యక్తికి వ్యాధి నయం అయింది. రోగికి సోకిన వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించడం ద్వారా వ్యాధిని నయం చేశామని శుక్రవారం బ్రిటీష్ పరిశోధకులు వెల్లడించారు. పెర్సిస్టెంట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ లాంగ్ కోవిడ్, పదే పదే వచ్చే కోవిడ్ ఇన్ఫెక్షన్లకు భిన్నంగా ఉంటుందని.. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన రోగుల్లో ఈ రకం ఇన్ఫెక్షన్ సంభవిస్తుందని పరిశోధకులు వెల్లడించారు. కోవిడ్ సగం మంది రోగులకు ఊపిరితిత్తుల వాపు వంటి నిరంతర లక్షణాలను కలిగిస్తుందని వైద్యులు తెలిపారు. అయితే చనిపోతాడనుకున్న వ్యక్తిని బతికించామని పరిశోధకులు చెబుతున్నారు.
Also Read
- North Korea: ఫుట్‌బాల్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించిన ఉత్తర కొరియా జట్టు.. షేక్ హ్యాండిచ్చి అభినందించిన కిమ్.. సెలబ్రేషన్స్ వైరల్!
- Trump: మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Iran War: కువైట్ ఏయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి..
- Pakistan: జపాన్‌లో మసీదు వివాదం.. పాకిస్తాన్ పరువు పోయిందిగా..
Read Also: Total Lunar Eclipse 2022: ఈ నెల 8న సంపూర్ణ చంద్రగ్రహణం.. “బ్లడ్ మూన్”గా దర్శనం ఇవ్వనున్న చంద్రుడు
బ్రిటన్ కు చెందిన 59 ఏళ్ల వ్యక్తి 13 నెలల తర్వాత ఎలా కోవిడ్ ను అధిగమించాడో వివరించారు పరిశోధకులు. అప్పటికే కిడ్నీ మార్పిడి కారణంగా బలహీనమైన ఇమ్యూనిటీ కలిగిన వ్యక్తికి డిసెంబర్ 2020లో కరోనా సోకింది. అతనికి పదేపదే ఇన్ఫెక్షన్ సోకుతుందా..? లేక లాంగ్ ఇన్ఫెక్షన్ సోకిందా..? అని తెలుసుకోవడనాకి నానోపోర్ సీక్వెనింగ్ టెక్నాలజీతో జన్యు విశ్లేషణ చేశారు. ఈ క్రమంలో రోగికి బీ.1 వేరియంట్ సోకినట్లుగా గుర్తించి చికిత్స అందించారు. కాసిరివిమాబ్, ఇమ్‌డెవిమాబ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ద్వారా చికిత్స అందించారు.
ఇతర యాంటీబాడీల చికిత్స మాదిరిగా.. ఈ చికిత్సను విస్తృతంగా ఉపయోగించరని.. ఇది ఓమిక్రాన్ వంటి వేరియంట్ పై సమర్థంగా పనిచేయదని పరిశోధకులు తెలిపారు. అయితే సదరు వ్యక్తి కోవిడ్ ఫస్ట్ వేవ్ లోనే కరోనాకు గురవ్వడంతో ఈ చికిత్స ద్వారా నయం చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం యూకే, యూఎస్ లతో పాటు పలుదేశాల్లో ఉన్న కోవిడ్ వేరియంట్లపై ప్రస్తుతం ఈ చికిత్స సమర్థవంతంగా పనిచేయకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
- Tags
- B.1 Variant
- corona
- Covid 19
- Omicron
- UK
తాజావార్తలు
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Test Match: ఆ ప్లేయర్‌కు రెస్ట్.. రంజీ హీరోకు ఛాన్స్..? అఫ్గాన్ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్ట్..
-
Ram Charan: రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్.. కూకట్‌పల్లిలో మెగా పవర్ స్టార్ ఆలయం! పూజలు చేస్తున్న ఫ్యాన్స్..
-
Kitchen Tips: బియ్యంలో పురుగుల నుంచి బిర్యానీ రైస్ వరకు.. వంటగది రూపురేఖలు మార్చే అమేజింగ్ చిట్కాలు!
-
Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్‌గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, Dimensity 7450 చిప్‌తో.!