NTV Telugu Site icon

Rishi Sunak: జన్మాష్టమి వేడుకలు.. భార్యతో కలిసి పూజలు చేసిన రిషి సునాక్

Rishi Sunak Visits Temple

Rishi Sunak Visits Temple

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయన భార్య అక్షతతో కలిసి భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించారు. ప్రసిద్ధ హిందూ పండుగ జన్మాష్టమిని జరుపుకోవడానికి తాను తన భార్యతో కలిసి ఆలయాన్ని సందర్శించినట్లు ఓ చిత్రాన్ని రిషి సునాక్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. బ్రిటీష్ ప్రధానమంత్రి రేసులో ఉన్న భారతీయ సంతతికి చెందిన నాయకుడు రిషి సునాక్ హిందూ ధర్మాన్ని ఎక్కువగా పాటిస్తారు. 2019లో హౌజ్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికైన స‌మ‌యంలో రిషి సునాక్ భగవద్గీతపై చేతులు పెట్టి ప్రమాణం చేశారు.

ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్, లిజ్‌ ట్రస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. కన్జర్వేటివ్ పార్టీ నేతతో పాటు బ్రిటన్‌ ప్రధానిగా ఎవరు ఎన్నికవుతారోనని ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఉన్న సర్వేల ప్రకారం లిజ్ ట్రస్ 32 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీంతో యూకే ప్రధాని అవకాశాలు లిజ్ ట్రస్ కే ఎక్కువగా ఉన్నాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. కాకపోతే ఓ సర్వేలో మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్ గురించి ప్రస్తావించింది. బ్రిటన్ ప్రధాని రేసులో బోరిస్ జాన్సన్‌ ఉండి ఉంటే ఆయనకే మళ్లీ పీఠం దక్కి ఉండేదని ‘స్కై న్యూస్’ కోసం నిర్వహించిన యూగస్ సర్వేలో తేలింది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో ఎక్కువ మంది బోరిస్‌నే కోరుకుంటున్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది.

Boris Johnson: రేసులో ఉంటే మళ్లీ బోరిస్ జాన్సనే ప్రధాని!

జాన్సన్ కనుక పోటీలో ఉండి ఉంటే 46 శాతం ఓట్లు ఆయనకే వచ్చి ఉండేవని తెలిసింది. అప్పుడు విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌కు 24 శాతం, సునాక్‌కు 23 శాతం ఓట్లు మాత్రమే వచ్చేవని ఈ సర్వే వెల్లడించింది. అంతే కాకండా బోరిస్ రాజీనామా కోసం ఒత్తిడి తీసుకొచ్చి తప్పు చేశారని 55 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రధాని పదవికి అభ్యర్థిని తేల్చేందుకు ఓటు వేసే అర్హత ఉన్న 1,089 మంది పార్టీ సభ్యులతో ఈ నెల 12 నుంచి 17 తేదీల మధ్య నిర్వహించిన యూగవ్ సర్వేలో ఈ విషయాలు వెలుగు చూశాయి. ఈ సర్వే వివరాలను గురువారం ప్రకటించారు.

 

Show comments