పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,500 కోట్ల మేర ముంచి విదేశాలకు చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. తనను భారత్‌కు అప్పగించవద్దని కోరుతూ అప్పీల్ దాఖలు చేసేందుకు లండన్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. నీరవ్ మానసిక స్థితి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అవకాశం కల్పించింది కోర్టు.. నీరవ్ ఇప్పటికే తీవ్ర కుంగుబాటుకు గురయ్యారు. ఇలాంటి సమయంలో ఆయన్ను ఇక్కడి నుంచి తరలిస్తే.. మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని.. అంతేకాదు ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.. నీరవ్‌ను అక్కడికి తరలిస్తే ఆత్మహత్య ఆలోచనలు అధికమయ్యే ప్రమాదం ఉందంటూ న్యాయవాది ఎడ్వర్డ్ ఫిట్జ్‌గెరాల్డ్.. గత నెలలో హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.. కానీ, భారత్ తరఫున వాదిస్తున్న ఇంగ్లాండ్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్.. ఈ విషయాలను తోసిపుచ్చింది. కానీ, ఇవాళ మాత్రం అనుమతి ఇచ్చింది.. నీరవ్ మానసిక ఆరోగ్యం, మానవ హక్కుల ఉల్లంఘన నేపథ్యంలో భారత్‌కు అప్పగించొద్దని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు.
నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం

Nirav Modi