Peanut Allergy: ఒక విషాదకర సంఘటనలో బ్రిటన్ డ్యాన్సర్ అమెరికాలో మరణించింది. వేరుశెనగ అలర్జీతో బాధపడుతూ.. ఆ తర్వాత అనాఫిలాక్టిక్ షాక్ కారణంగా మరణించింది. మరణించిన డ్యాన్సర్‌ని 25 ఏళ్ల ఓర్లా బాక్సెండేల్‌గా గుర్తించారు. వాస్తవానికి లాంక్‌షైర్‌కి చెందిన ఓర్లా తనను తాను డ్యాన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి న్యూయార్క్‌లో ఉంటోంది.
అయితే, ఇటీవల ఓ కంపెనీకి చెందిన కుకీ తినడంతో ఆమె పీనట్ అలర్జీకి గురైంది. ఆమె కుటుంబం తరుపు న్యాయవాదులు చేసిన ప్రకటన ప్రకారం.. ఆమె తిన్న కుకీ, కుకీస్ యునైటెడ్ ద్వారా తయారు చేయబడిందని, స్టీవ్ లియోనార్డ్స్ ద్వారా అమ్మారని, అయితే, ఇందులో ఉన్న పదార్థాలను బహిర్గతం చేయలేదని ఆరోపించారు. ఓర్లా జనవరి 11న ఒక సోషల్ మీటింగ్‌లో కుకీని తిని కుప్పకూలిపోయింది. కొన్ని క్షణాల తర్వాత తీవ్రమైన అలర్జీ రియాక్షన్ వల్ల అనాఫిలాక్టిక్ షాక్ కారణంగా మరణించింది.
ఓర్లా మరణానికి కుకీని తయారు చేసిన కంపెనీయే కారణమని ఆమె కుటుంబ సభ్యులు దుయ్యబడుతున్నారు. ప్యాకేజ్‌పై కుక్కీలో ఏ పదార్థాలు ఉపయోగించామనేది తెలపలేదని, వారి నిర్లక్ష్యం కారణంగానే ఆమె మరణించిందని ఆరోపించారు.
Read Also: Sai Pallavi : చెల్లెలి ఎంగేజ్మెంట్ లో సాయి పల్లవి కట్టిన చీర ధర ఎంతో తెలుసా?
పీనట్ అలెర్జీ:
పీనట్ అలెర్జీ అనేది ఒక తీవ్రమైన పరిస్థితి, ఇది తేలికపాటి అనారోగ్యంతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాంత అనాఫిలిక్సిస్ వరకు కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది ప్రభావితమవుతున్నారు. అత్యంత సాధారణ అహార అలెర్జీల్లో ఇది ఒకటి. వేరుశెనగ తినడం వల్ల ఈ అలెర్జీ ఏర్పడుతుంది. ఇది చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, కడుపులో ఇబ్బంది, వికారం వంటి రియాక్షన్లకు కారణమువుతంది. శ్వాసతీసుకోవడంతో ఇబ్బంది, అనాఫిలాక్సిస్ షాక్ మరణానికి దారి తీయవచ్చు. అనాఫిలాక్సిస్ అనేది పీనట్ అలెర్జీ వల్ల వస్తుంది. దీని వల్ల శ్వాసనాళాలు కుచించుకుపోవడం, గొంతులో వాపుతో శ్వాస ఇబ్బందులు, బీపీ తగ్గడం, పల్స్ పెరగడం వంటి వాటి వల్ల మరణం సంభవిస్తుంది.