NTV Telugu Site icon

France: వైమానిక విన్యాసాల్లో అపశృతి.. 2 విమానాలు ఢీ.. ముగ్గురికి సీరియస్

France

France

ఫ్రాన్స్‌లో జరిగిన వైమానిక విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకుంది. ఫ్రెంచ్ వైమానికి దళానికి చెందిన విమానాలు విన్యాసాలు చేస్తుండగా గాల్లో రెండు విమానాలు ఢీకొన్నాయి. దీంతో ఆకాశం నుంచి విమానాలు కిందపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముగ్గురు అపస్మారక స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: NTR : జపాన్‌లో భార్య ప్రణతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపిన ఎన్టీఆర్

వైమానిక స్థావరం సమీపంలో ఆల్ఫా జెట్ విమానాలు ఢీకొన్నాయని ఫ్రెంచ్ వైమానిక మరియు అంతరిక్ష దళం తెలిపింది. ఒక విమానం సైలోను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని తెలిపింది. ఇద్దరు పైలట్లు, ఒక ప్రయాణికుడు విమానం నుంచి సురక్షితంగా బయటకు వచ్చారని.. వారంతా స్పృహలోనే ఉన్నారని తెలిపింది. ఒక వ్యక్తి మాత్రం తీవ్ర గాయాలు అయినట్లుగా పేర్కొంది. పౌరులకు మాత్రం ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపింది.

ఇది కూడా చదవండి: Gaza: హమాస్‌పై ప్రజలు తిరుగుబాటు.. ‘హమాస్ అవుట్’ అంటూ నిరసన ర్యాలీలు

ఆరు విమానాలు వేర్వేరు రంగులతో డ్రైవ్ చేస్తున్నాయి. నాలుగు విమానాలు ఒకే పథంలో వెళ్తుండగా.. ఎడమ వైపున ఉన్న రెండు విమానాలు మాత్రం ఢీకొని కిందకు దూసుకొచ్చాయి. ప్రమాదం జరగగానే మంటలు చెలరేగి.. పొగలు ఎగిసిపడ్డాయి. రిహార్సల్స్ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా ఫ్రెంచ్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్ను తెలిపారు. ఉక్రెయిన్ పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి ఫ్రాన్స్ తేలికపాటి ఆల్ఫా ట్విన్-ఇంజన్ విమానాలు ఉపయోగిస్తుంది. గతేడాది ఆగస్టులో తూర్పు ఫ్రాన్స్‌లో రెండు ఫ్రెంచ్ రాఫెల్ జెట్‌లు గాల్లో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. రాఫెల్ యుద్ధ విమానాలను భారత్, ఈజిప్ట్, గ్రీస్, ఇండోనేషియా, క్రొయేషియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఫ్రాన్స్ విక్రయించింది.