అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానాశ్రయంలో పార్క్ చేసిన విమానాన్ని మరో చిన్న విమానం ఢీకొట్టింది. దీంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. అయితే పైలట్ సహా ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దట్టంగా మంటలు అంటుకోవడంతో పక్కనున్న పలు విమానాలు కూడా దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Texas Firing: టెక్సాస్‌లో కాల్పులు.. ముగ్గురు మృతి
నలుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న సింగిల్ ఇంజిన్ విమానం కాలిస్పెల్ సిటీ విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తుండగా ఆగి ఉన్న విమానాన్ని ఢీకొట్టింది. అనంతరం మంటలు అంటుకున్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Trump: పుతిన్ మైండ్‌సెట్ నిమిషాల్లోనే తెలిసిపోతుంది.. అలాస్కా భేటీపై ట్రంప్ వ్యాఖ్య
కాలిస్పెల్ పోలీస్ చీఫ్ జోర్డాన్ వెనెజియో, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. నలుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న సింగిల్ ఇంజిన్ విమానం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కాలిస్పెల్ నగర విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తోందని.. ఆ సమయంలో ఆగి ఉన్న మరొక విమానాన్ని ఢీకొట్టిందని తెలిపారు. మంటలు అంటుకోవడంతో పలు విమానాలకు కూడా మంటలు అంటుకున్నట్లు వెనిజియా చెప్పారు.
ఇది కూడా చదవండి: Trump: సుంకాలపై ట్రంప్ పక్షపాతం.. చైనాకు ఏం చేశారంటే..!
ప్రమాదం జరగగానే పైలట్, ముగ్గురు ప్రయాణికులు క్షేమంగా బయటకు వచ్చేశారని అని కాలిస్పెల్ అగ్నిమాపక అధికారి జే హేగెన్ తెలిపారు. ఇద్దరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారని, వారికి విమానాశ్రయంలో చికిత్స అందించామని హెగెన్ చెప్పారు.
