NTV Telugu Site icon

మరోసారి బరితెగించిన ట్విట్టర్.. వేరే దేశంగా లడాఖ్‌..

Twitter Ladakh

Twitter Ladakh

సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ మరోసారి బరితెగించింది… రెచ్చగొట్టే చర్యలకు దిగింది. కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్‌ను వేరే దేశంగా తన వెబ్‌సైట్‌లో చూపించింది.. ఇక, జమ్మూ కశ్మీర్‌ను పాకిస్థాన్‌లో అంతర్భాగంగా చూపించింది.. ట్విట్టర్‌ చర్యలపై సీరియస్‌గా ఉంది భారత ప్రభుత్వం… ట్విట్టర్‌ గతంలోనూ ఇలాంటి తప్పులే చేసింది.. గత ఏడాది లడాఖ్‌ను చైనాలో అంతర్భాగమని చూపించింది.. దీనిపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తగా.. కేంద్రం వివరణ కోరడంతో క్షమాపణలు చెప్పింది.. సరిగ్గా ఏడాది కాకముందే.. మరోసారి అలాంటి తప్పే చేసింది.. ఈ సారి ఏకంగా లాడాఖ్‌ను వేరే దేశంగా చూపించింది. కాగా, కేంద్రం కొత్త ఐటీ రూల్స్‌ తెచ్చిన తర్వాత.. వాటి అమలు విషయంలో.. భారత్‌ ప్రభుత్వం వర్సెస్ ట్విట్టర్‌గా మారిపోయింది పరిస్థితి.. ప్రతీసారి ఏదో ఒక వివాదం కొనసాగుతూ వస్తోంది.