
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఉదృతం అవుతున్న సంగతి తెలిసిందే. భారత్ ను ఆదుకోవడానికి పలు దేశాలు ముందుకు వచ్చాయి. అంతర్జాతీయ సంస్థలు. బహుళ జాతీయ కంపెనీలు ముందుకు తమవంతు సహాయం ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ 110 కోట్ల రూపాయల సహాయాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని భారత్ లోని కేర్, ఎయిడ్ ఇండియా, సేవ ఇంటర్నేషనల్ సంస్థలకు పంపిణి చేసింది. ఈ మూడు సంస్థలు ఈ నిధులను భారత్ లో కరోనా మహమ్మారి కోసం ఖర్చు చేయనున్నాయి. ఆక్సిజన్, కరోనా కేర్ సెంటర్లు, వ్యాక్సిన్ తదితర వాటికి ఖర్చు చేయబోతున్నాయి.