NTV Telugu Site icon

ట్విట్ట‌ర్‌లో కొత్త ఆప్ష‌న్‌: త్వ‌ర‌లో డిస్‌లైక్ బ‌ట‌న్‌…కానీ…

ఇప్ప‌టి వ‌ర‌కు ట్విట్ట‌ర్‌లో కామెంట్‌, రీట్వీట్‌, లైక్, అప్‌లోడ్ బ‌ట‌న్ యాక్టివిటీస్ మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి.  140 ప‌దాల‌కు మించి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌డం కుద‌ర‌దు.  ట్వీట్ పెద్ద‌దిగా ఉంటే కొన‌సాగింపుగా త్రెడ్ ట్వీట్‌ను వేస్తాము.  అయితే, ఇప్పుడు ట్విట్ట‌ర్ డిస్‌లైక్ బ‌ట‌న్‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని చూస్తున్న‌ది.  కేవ‌లం లైక్ ఆప్ష‌న్ మాత్ర‌మే ఉండ‌టం వ‌ల‌న ట్వీట్ న‌చ్చ‌ని వ్య‌క్తులు కామెంట్స్ రూపంలో మెసేజ్‌లు చేస్తుండ‌టంతో పెద్ద ఎత్తున గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి.  అదే  డిస్‌లైక్ బ‌ట‌న్‌ను అందుబాటులోకి తెస్తే న‌చ్చిన వ్య‌క్తులు సింపుల్‌గా డిస్‌లైక్ చేసి వ‌దిలేసే అవ‌కాశం ఉన్న‌ది.  అయితే, ప్ర‌స్తుతం దీనిని ఐఓఎస్ వెర్ష‌న్ లో ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్నారు.  అయితే, ఎవ‌రైనా ట్వీట్‌ను డిస్‌లైక్ చేస్తే అది లైక్ మాదిరిగా అంద‌రికి క‌నిపించ‌దు.  కేవ‌లం ఎవ‌రైతే ట్వీట్‌ను పోస్ట్ చేస్తారో వారికి మాత్ర‌మే క‌నిపించే విధంగా దీనిని డిజైన్ చేస్తున్నారు.  త్వ‌ర‌లోనే ఈ ఆప్ష‌న్ అందుబాటులోకి వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.  

Read: మోహన్ లాల్ ‘బ్రో డాడీ’ లో మీనా!