మోహన్ లాల్ ‘బ్రో డాడీ’ లో మీనా!

మోహన్ లాల్, మీనా లది మలయాళంలో సూపర్ హిట్ జోడి. ఈ మధ్య కాలంలో అయితే ‘దృశ్యం, దృశ్యం-2’లో వాళ్ళు జంటగా నటించారు. దానికి ముందు కూడా వాళ్ళిద్దరూ కలిసి దాదాపు ఆరేడు సినిమాల్లో నటించారు. ఇప్పుడు మరోసారి మోహన్ లాల్ మూవీ ‘బ్రో డాడీ’లో మీనా నటిస్తోంది. బహుశా ఇది వాళ్ళిదరికీ పదో చిత్రం కావచ్చు. అయితే మీనా… మోహన్ లాల్ కు జోడీగా నటిస్తోందా లేదా అనేది మాత్రం తెలియ రాలేదు. బుధవారం ‘బ్రో డాడీ’ షూటింగ్ లో పాల్గొన్నట్టు మీనా ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. తొలిసారి మోహన్ లాల్ ‘లూసిఫర్’ కోసం మెగాఫోన్ పట్టిన స్టార్ హీరో పృధ్వీరాజ్ మరోసారి ఆయనతోనే ‘బ్రో డాడీ’ని తెరకెక్కిస్తున్నాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ షూటింగ్ గత వారం హైదరాబాద్ లో మొదలైంది. మోహన్ లాల్ తో పాటు పృధ్వీరాజ్, కళ్యాణీ ప్రియదర్శన్, లాలు అలెక్స్, మురళీ గోపి, సౌబిన్ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ లో ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నాడు.

View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16)

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-