NTV Telugu Site icon

Turkey: టర్కీలో ఘోర అగ్నిప్రమాదం.. 66 మంది మృతి

Turkeyfire

Turkeyfire

టర్కీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వాయువ్య టర్కీలోని స్కీ రిసార్ట్‌లోని ఓ హోటల్‌లో భారీ అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 66 మంది మరణించారు. 51 మంది గాయపడ్డారు. భయాందోళనతో భవనంపై నుంచి దూకిన బాధితుల్లో ఇద్దరు మరణించారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘోరం జరిగింది.

ఇది కూడా చదవండి: APSRTC: సంక్రాంతి ‘పండుగ’ చేసుకున్న ఏపీఎస్ఆర్టీసీ.. రికార్డు స్థాయిలో ఆదాయం..

అగ్నిప్రమాదంలో 66 మంది చనిపోయారని.. 51 మంది గాయపడ్డారని.. వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని టర్కీ ఆరోగ్య మంత్రి కెమల్ మెమిసోగ్లు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున ఈ విపత్తు సంభవించినట్లు పేర్కొన్నారు. సంఘటనాస్థలిని అంతర్గత మంత్రి యెర్లికాయ సందర్శించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. 17 మంది డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారని పేర్కొన్నారు. ప్రముఖ స్కీ రిసార్ట్‌లోని 12 అంతస్తుల హోటల్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: Harish Rao: ప్రజాపాలన కాదు.. ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలన

ఇస్తాంబుల్‌కు తూర్పున 300 కిలోమీటర్లు (185 మైళ్లు) దూరంలో ఉన్న బోలు ప్రావిన్స్‌లోని కొరోగ్లు పర్వతాలలో కర్తాల్‌కాయ రిసార్ట్‌లోని గ్రాండ్ కర్తాల్ హోటల్‌కు భారీగా సందర్శకులు వచ్చినట్లు టర్కీ అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ చెప్పారు. హోటళ్లు కిక్కిరిసి ఉన్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:30 గంటలకు హోటల్ రెస్టారెంట్ సెక్షన్‌లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఆరుగురు ప్రాసిక్యూటర్లను నియమించింది.

ఇది కూడా చదవండి: Sai Ram Shankar : ‘ఒక పథకం ప్రకారం’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సాయిరామ్ శంకర్