NTV Telugu Site icon

Pakistan: మీరు టర్కీ రావాల్సిన అవసరం లేదు.. పాక్ ప్రధానికి ఘోర అవమానం..

Pakistan

Pakistan

Turkey insults Pakistan: అసలే ఆర్థిక ఇబ్బందుల్లో, కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్న పాకిస్తాన్ ను ఏ దేశం కూడా పట్టించుకోవడం లేదు. పతనానికి కొన్ని అడుగుల దూరంలో ఉంది పాకిస్తాన్. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) షరతులకు తలొగ్గితేనే పాకిస్తాన్ కు అప్పు పుడుతుంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ నాయకులు మాత్రం కొన్ని సందర్భాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నారు. అసలే భూకంపం ధాటికి తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్న టర్కీని సందర్శించాలని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో భావించారు. అయితే టర్కీ మనకు ఆప్తమిత్రుడే కదా.. అని అనుకుంటే, చివరకు పాకిస్తాన్ పరువుపోయే పరిస్థితి ఏర్పడింది. టర్కీ పాక్ ప్రధానికి ఆతిథ్యం ఇవ్వలేమని మొహం మీదనే చెప్పింది, దీంతో పాక్ ఇజ్జత్ పోయింది.

Read Also: The Kashmir Files: ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలకు వివేక్ అగ్నిహోత్రి కౌంటర్ అదిరిందిగా!

ప్రతీసారి కాశ్మీర్ విషయంలో టర్కీ, పాకిస్తాన్ కు మద్దతు పలుకుతోంది. భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అయితే టర్కీ భూకంపం నెపంతో ఆ దేశానికి మరింత దగ్గర అవ్వాలని పాకిస్తాన్ భావించింది. ఈ నేపథ్యంలో భూకంప బాధితులకు సంఘీభావం చెప్పాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 8న టర్కీ రాజధాని అంకారా వెళ్లాలని భావించారు. ప్రధాని బుధవారం ఉదయం అంకారా వెళ్తారని పాకిస్తాన్ సమాచారం మంత్రి మరియం ఔరంగజేబు మంగళవారం ట్వీట్ చేశారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ కు తమ సంతాపాన్ని ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో పాటు విదేశాంగమంత్రి బిలావల్ భుట్టో తెలియజేస్తారని ట్వీట్ లో వెల్లడించింది.

ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే టర్కీ ప్రధానమంత్రికి మాజీ ప్రత్యేక సహాయకుడు అజం జమీల్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి తన దేశం సిద్ధంగా లేదని ట్వీట్ చేశారు. పాకిస్తాన్ ప్రధానికి ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో టర్కీ తమ ప్రజలను చూసుకోడంలో బిజీగా ఉందని.. దయచేసి సహాయక సిబ్బందిని మాత్రమే పంపండి అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో పాక్ ప్రధాని టర్కీ పర్యటన రద్దైంది.