Turkey Earthquakes: భారీ భూకంపాల ధాటికి టర్కీ కుదేలైంది. సోమవారం 7.8, 7.5 తీవ్రతతో వచ్చిన భూకంపాల వల్ల టర్కీ, సిరియా దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 11,200 మందికి పైగా మరణించారు. ఈ మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. టర్కీ, సిరియా దేశాలకు ప్రపంచదేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. ఇండియా కూడా తన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని, ఇతర వైద్య సహాయాన్ని టర్కీకి పంపింది.
Read Also: Imran Khan: ఆర్టికల్ 370ని పునరుద్దరిస్తేనే భారత్‌తో చర్చలు..
ఇదిలా ఉంటే ప్రస్తుతం సంభవించిన భూకంపం ధాటికి టెక్టానిక్ ప్లేట్ మూడు అడుగులు(10మీటర్ల) వరకు కదిలి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇటాలియన్ భూకంప శాస్త్రవేత్త ప్రొఫెసర్ కార్లో డోగ్లియోని మాట్లాడుతూ.. సిరియాతో పోలిస్తే టర్కీ పశ్చిమం వైపు 5-6 మీటర్లు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. రాబోయే రాజుల్లో శాటిలైట్ చిత్రాలు వచ్చిన తర్వాత మరింత సమాచారం వస్తుందని తెలిపారు. 190 కిలోమీటర్ల పొడవు 25 కిలోమీటర్ల వెడల్పుతో భూమిపై పగుళ్లు ఏర్పడి, భూమి తీవ్రంగా కదిలినట్లు ఆయన వెల్లడించారు. తొమ్మిది గంటల వ్యవధి రెండు శక్తివంతమైన భూకంపాలతో పాటు వందకు పైగా భూకంపాలు టర్కీ ప్రాాంతాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని వెల్లడించారు.
టర్కీ అత్యధిక భూకంపాలు వచ్చే అనటోలియన్ టెక్టానిక్ ప్లేట్ లో ఉంది. ఇది అపసవ్య దిశలో కదులుతూ ఉంది. ఈ అనటోలియన్ టెక్టానిక్ ప్లేట్ ఆఫ్రికా, యూరేషియా, అరేబియా టెక్టానిక్ ప్లేట్ మధ్య ఉంది. అరేబియ టెక్టానిక్ ప్లేట్ టర్కీ ఉన్న అనటోనలియన్ టెక్టానిక్ ప్లేట్ ను క్రమంగా నెడుతోంది. దీంతో ఒత్తడి కారణంగా భూకంపాలు ఏర్పడుతున్నాయి. టర్కీ ఉన్న ప్రాంతం ముందుకు కదిలి యూరేషియా టెక్టానిక్ ప్లేట్ ను ఢీకొడుతోంది. దీని కారణంగా విపరీతమైన శక్తి భూకంపాల రూపంలో బయటకు వస్తోంది.