NTV Telugu Site icon

Earthquak: ఫిలిఫ్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

Tsunami

Tsunami

Earthquak: ఆసియా దేశం ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. మిండనావోలో శనివరాం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్(EMSC) తెలిపింది. భూమికి 63 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు చెప్పింది.

Read Also: Pakistan: భారీ ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న పాకిస్తాన్..

భారీ భూకంపం తర్వాత అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ సునామీ హెచ్చరికల్ని జారీ చేసింది. గత నెల ప్రారంభంలో కూడా దక్షిణ ఫిలిప్పీన్స్‌లో 6.7 భూకంపం సంభవించింది. దీంతో 8 మంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. చాలా భవనాలు ధ్వంసమయ్యాయి.

Read Also: Michaeng Effect: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీ మీదుగా వెళ్లే 144 రైళ్లు రద్దు

పసిఫిక్ మహా సముద్రంలో ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ అనే ప్రదేశంలో ఇండోనేషియా, ఫిలిఫ్పీన్స్, జపాన్ వంటి దేశాలు ఉన్నాయి. దీంతో అక్కడ తరుచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల కదలికలు నిరంతరం చోటు చేసుకుంటాయి. దీంతో పాటు క్రియాశీలక అగ్నిపర్వతాలకు ఈ ప్రాంతం కేంద్రంగా ఉంది. దీంతోనే ఇక్కడ తరుచుగా భూకంపాలు వస్తుంటాయి.