Site icon NTV Telugu

Russia Earthquake: సునామీ కారణంగా ఒడ్డుకు కొట్టికొచ్చిన భారీ తిమింగలాలు

Russiaearthquake3

Russiaearthquake3

రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 8.8తో భూకంపం సంభవించింది. దీంతో రష్యాలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం రష్యాతో పాటు అమెరికా, జపాన్, కెనడా, న్యూజిలాండ్‌లకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక రష్యా, జపాన్ తీరంలో 13 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిపర్వతం, భూకంప కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన సెవెరో-కురిల్స్క్ ప్రాంతంలో పెద్ద ఎత్తున అలలు ఎగసి పడుతున్నాయి. ఇక ఓడరేవులు ధ్వంసం అయ్యాయి. భారీ అలలు కారణంగా భారీ తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Russia Earthquake: రష్యాలో సునామీ బీభత్సం.. వెలుగులోకి డ్రోన్ విజువల్స్

1952 తర్వాత తాజాగా రష్యాలో సంభవించిన భూకంపం శక్తివంతమైందిగా అధికారులు పేర్కొన్నారు. ఇక భారీ అలులు కారణంగా తీరం కొట్టుకుపోయింది. పడవలు సముద్రంలోకి వెళ్లిపోయాయి. ఇక చిబా ప్రిఫెక్చర్‌లోని టటేయామా నగరంలో అనేక తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Amit Shah: సోమవారం రాత్రంతా మేల్కొనే ఉన్న అమిత్ షా.. దేనికోసమంటే..!

అమెరికా సునామీ హెచ్చరిక కేంద్రం ప్రకారం.. రష్యా, హవాయి, ఈక్వెడార్ వరకు కూడా 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని తెలిపింది. భూకంపం 19.3 కి.మీ (12 మైళ్ళు) లోతులో ఏర్పడింది. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్‌కు తూర్పు-ఆగ్నేయంగా 125 కి.మీ (80 మైళ్ళు) దూరంలో అవాచా బే తీరం వెంబడి కేంద్రీకృతమై ఉందని అమెరికా తెలిపింది. ఇక రష్యాతో పాటు అమెరికా, జపాన్‌లకు సునామీ హెచ్చరికలను అధికారులు జారీ చేశారు. అలాస్కాతో సహా అనేక ప్రాంతాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ప్రకంపనలకు భవనాలు కంపించాయి.

 

Exit mobile version