Site icon NTV Telugu

Donald Trump: ఇరాన్‌కి ట్రంప్ లేఖ.. అణు ఒప్పందంపై చర్చలు..

Trump

Trump

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనికి లేఖ రాశారు. ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలు జరపాలని కోరుకుంటున్నట్లు గురువారం ఇరాన్ నాయకత్వానికి లేఖ పంపారు. చర్చలకు ఇరాన్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ‘‘మీరు చర్చలు జరుపుతారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇరాన్‌కి ఇది చాలా మంచిది’’ అని ట్రంప్ శుక్రవారం ఫాక్స్ బిజినెస్ నెట్వర్క్ బ్రాడ్‌కాస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

Read Also: YouTuber: గర్ల్‌ఫ్రెండ్‌ని, ఆమె తల్లిని ఒకేసారి గర్భవతులుగా చేసిన యూట్యూబర్.. నిజం ఏంటంటే..

‘‘వాళ్లు లేఖని అందుకుంటారని నేను అనుకుంటున్నాను. మరో ప్రత్నామ్నాయం ఏంటంటే, మనం ఏదైనా చేయాలి, ఎందుకంటే మనం మరో అణ్వాయుధాన్ని అనుమతించలేము’’ అని అన్నారు. ట్రంప్ తన లేఖని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని ఉద్దేశించి రాసినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇరాన్ అణు కార్యక్రమం చుట్టూ ఉన్న పరిస్థితిని పరిష్కరించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ ఇరాన్ రాయబారి కజెం జలాలీతో చర్చించారని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.

Exit mobile version