Trump: ప్రపంచానికి ఈరోజు గొప్ప రోజు.. స్వర్ణయుగం రాబోతుందన్న ట్రంప్
- ప్రపంచానికి ఈరోజు గొప్ప రోజు
- మధ్యప్రాచ్యం స్వర్ణయుగం కాబోతుందన్న ట్రంప్
- స్వాగతించిన ఐరాస, ప్రపంచ దేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ శాంతికి ఈరోజు గొప్ప రోజు అని.. ఇకపై అన్ని సానుకూల చర్యలే ఉంటాయని అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. యుద్ధంతో ఇరాన్‌కు విసుగొచ్చిందని.. ఇప్పుడు శాంతి కోరుకుంటోందని తెలిపారు. మిగతా దేశాలకూ ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. ఇరాన్ తిరిగి పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించవచ్చని.. పరిస్థితి సజావుగా సాగేందుకు అక్కడే ఉండి పర్యవేక్షిస్తామన్నారు. అన్నీ బాగానే జరుగుతాయని నమ్మకం ఉందని… అమెరికాలో మాదిరిగానే మధ్యప్రాచ్యానికి కూడా స్వర్ణయుగం రాబోతుంది.” అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Trump: సంపూర్ణ విజయం సాధించాం.. ఇరాన్ ఒప్పందం వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
- Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
- Pakistan: అజ్ఞాత వ్యక్తులు జోరు.. లష్కరే తోయిబా కమాండర్ డెడ్.. భోజనం చేసిన గంటల్లోనే ఖతం..
- Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
‘‘ప్రపంచ శాంతికి ఇది ఒక గొప్ప రోజు! ఇది జరగాలని ఇరాన్ కోరుకుంటోంది. వారికి ఇక చాలు అనిపించింది! అలాగే మిగతా అందరికీ కూడా! హార్ముజ్ జలసంధిలో రవాణాను పునరుద్ధరించడంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సహాయం చేస్తుంది. ఎన్నో సానుకూల చర్యలు ఉంటాయి! భారీగా డబ్బు సంపాదించవచ్చు. ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించవచ్చు. మేము అన్ని రకాల సామాగ్రిని సిద్ధం చేసుకుని.. అంతా సవ్యంగా జరిగేలా చూసుకోవడానికి అక్కడే ఉంటాం. అది జరుగుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. అమెరికాలో మనం అనుభవిస్తున్నట్లే.. ఇది మధ్యప్రాచ్యానికి స్వర్ణయుగం కావచ్చు!!!’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఐరాస స్వాగతం..
ఇక రెండు వారాల అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణను ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ స్వాగతించారు. మధ్యప్రాచ్యంలో దీర్ఘకాలిక శాంతి కోసం అన్ని పక్షాలు కృషి చేయాలని కోరారు. ఈ మేరకు గుటెర్రెస్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇజ్రాయెల్ మద్దతు
ఇరాన్‌పై బాంబు దాడులను నిలిపివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నామని ఇజ్రాయెల్ బుధవారం తెలిపింది, అయితే చివరి నిమిషంలో కుదిరిన ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ చేరలేదని స్పష్టం చేసింది. లెబనాన్‌పై దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ తెలిపింది. ఇక యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాతో చర్చల కోసం రెండు వారాల విరామాన్ని ఉపయోగించుకుంటామని టెహ్రాన్ ప్రకటించింది. పాకిస్థాన్‌లో శుక్రవారం చర్చలు ప్రారంభం కానున్నాయి.

తాజావార్తలు
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
-
AAA Cinemas : AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్. బన్నీ ఎమోషనల్ ట్వీట్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!