Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్

  • ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం
  • హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
Trump3

Trump3

హార్ముజ్‌పై ఇరాన్ సుంకాలు విధిస్తే.. మేమూ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాలిఫోర్నియా పర్యటన సందర్భంగా బుధవారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్-ఒమన్‌ల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని.. రేపు లేదా ఎల్లుండి నాటికి జరగవచ్చని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నౌకల నుంచి సుంకాలు వసూలు చేయడాన్ని అనుమతించవద్దని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.

జలమార్గాన్ని వెంటనే తిరిగి తెరవాలని, లేకపోతే తాను భారీ దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ హెచ్చరించారు. ఆ తర్వాత జలమార్గం దానంతట అదే తిరిగి తెరుచుకుంటుందని అన్నారు. ఒకవైపు ఒప్పందంపై ఆశలు పెరుగుతుండగా… మరోవైపు ప్రాంతీయ జలమార్గాల్లో వాణిజ్య నౌకలపై దాడులు ఇంకా కొనసాగుతుండటం గమనార్హం.

కొత్త ఒప్పంద ప్రణాళిక ఏమిటి?

మీడియా నివేదికల ప్రకారం.. ఇరాన్-ఒమన్ మధ్య కొనసాగుతున్న చర్చల్లో భాగంగా ఒక కొత్త ఫార్ములా రూపుదిద్దుకుంటున్నట్లు ప్రాంతీయ అధికారులు తెలిపారు. దీని ప్రకారం.. నౌకలు ఇరాన్ నియంత్రణలో ఉన్న ఉత్తర మార్గం ద్వారా పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశిస్తాయి. తిరిగి వచ్చేటప్పుడు, అవి ఒమన్ నియంత్రణలో ఉన్న దక్షిణ మార్గాన్ని ఉపయోగిస్తాయి. సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రతిఫలంగా.. నౌకల నుంచి సేవా రుసుము లేదా టోల్ వసూలు చేయవచ్చు. అయితే, ఈ మార్గంలో ఇరాన్ టోల్ వసూలు చేయడానికి తాను అనుమతించబోనని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా చర్చల్లో పురోగతిని ధృవీకరించారు.. కానీ ఇంకా ఎలాంటి తుది నిర్ణయం లేదా పూర్తి ఒప్పందం కుదరలేదని తెలిపారు.