Site icon NTV Telugu

Donald Trump: మా మాట వంటే ఇరాన్ గొప్ప దేశమవుతుంది.. లేదంటే యుద్ధం తప్పదు..

Trump

Trump

Donald Trump: అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. బుధవారంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగుస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు ఇరాన్‌పై ప్రశంసలు కురిపిస్తూనే, మరోవైపు హెచ్చరికలు జారీ చేశారు. సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా బలమైన స్థితిలో ఉందని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, కాల్పుల విరమణ పొడిగించాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. చర్చలు విఫలమైతే సైనిక చర్యకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

Read Also: Lucky Zodiac Signs : మీన రాశిలోకి శని.. రేపటి నుంచి ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది..!

మరోవైపు, ఇరాన్ ఒప్పందం కుదుర్చుకుంటే, చాలా బలమైన దేశంగా మంచి స్థితికి చేరుకుంటుందని, ఒక అద్భుతమైన దేశంగా మారగలదని, ఇరాన్ ప్రజలు అద్భుతమైన ప్రజలు ఉన్నారని, వారు హేతుబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. అమెరికా చేపట్టిన హార్ముజ్ దిగ్బంధం ఒక మంచి విజయమని ప్రశంసించారు. తాము ఈ యుద్ధంలో భారీ తేడాతో గెలుస్తున్నామని, అమెరికా సైన్యం అద్భుతంగా పనిచేసిందని కొనియాడారు.

మరోవైపు, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం వెళ్తోంది. ఇదిలా ఉంటే, తాము ఈ చర్చలకు రావడం లేదని ఇరాన్ చెబుతోంది. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపిస్తోంది. మరోవైపు అమెరికా కూడా ఇదే ఆరోపణలు చేస్తోంది.

Exit mobile version