అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. పశ్చిమాసియా పర్యటనలో భాగంగా మంగళవారం సౌదీ అరేబియా చేరుకున్నారు. ట్రంప్‌నకు యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ స్వాగతం పలికారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక.. పశ్చిమాసియాలో పర్యటించడం ఇదే తొలిసారి. నాలుగు రోజుల పాటు సౌదీ, యూఏఈ, ఖతార్‌ను సందర్శించనున్నారు.
ఇక పశ్చిమాసియా పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎప్పుడు భార్య మెలానియాతో పర్యటించే ట్రంప్.. ఈసారి మాత్రం సింగిల్‌గా వచ్చారు. పక్కన మెలానియా లేకుండానే పర్యటించడం ఆసక్తి రేపుతోంది. ఇటీవల పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు భార్యతోనే రోమ్‌లో పర్యటించారు. ఇంతలో ఏమైందో తెలియదు గానీ.. పశ్చిమాసియా టూర్‌కు మాత్రం ట్రంప్ సింగిల్‌గా వచ్చారు. ట్రంప్ వెంట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్, ఇంధనశాఖ మంత్రి క్రిస్ రైట్ ఉన్నారు.
ఇది కూడా చదవండి: BrahMos: ఆపరేషన్ సిందూర్‌తో “బ్రహ్మోస్”కి సూపర్ క్రేజ్.. కొనుగోలుకు 17 దేశాలు క్యూ..
ఇక బుధవారం రియాద్‌లో జరిగే గల్ఫ్-యూఎస్ శిఖరాగ్ర సమావేశానికి ట్రంప్ హాజరవుతారు. అలాగే బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో కూడిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సభ్యుల సమావేశంలో కూడా ట్రంప్ పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: Final Destination Bloodlines: వెన్నులో వణుకు పుట్టించే సినిమా.. ఈనెల15 అర్ధరాత్రి బెనిఫిట్ షో..
పర్యటనలో భాగంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కూడా ట్రంప్ చర్చించనున్నారు. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత సౌదీ అరేబియా వేదికగా అమెరికా అధికారులు యుద్ధంపై చర్చించారు. కానీ ఒక కొలిక్కి రాలేదు. తాజాగా ట్రంప్ టూర్‌తోనైనా ఒక పరిష్కారం దొరుకుతుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే ఖతార్ రాజకుటుంబం అత్యంత విలువైన బోయింగ్ 737 విమానాన్ని ట్రంప్‌నకు గిఫ్ట్‌గా ఇవ్వనుంది. ఈ కానుకను ఎయిర్ ఫోర్స్‌వన్ కింద వాడుకోవాలని ట్రంప్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షులకు అందిన అత్యంత విలువైన బహుమతి ఇదే కావొచ్చని తెలుస్తోంది.
