Site icon NTV Telugu

Trump: యూకే టూర్‌లో ట్రంప్‌కు చేదు అనుభవం.. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న ఫొటోలు ప్రదర్శన

Trump

Trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన భార్య మోలానియో బుధవారం, గురువారం లండన్‌లో పర్యటించనున్నారు. బుధవారం విండ్సర్ కోటలో కింగ్ చార్లెస్-3, క్వీన్ కెమెల్లా ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఇక గురువారం ప్రధాని కీర్ స్టార్మర్‌తో ట్రంప్ భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక విషయాలపై చర్చించనున్నారు.

ఇది కూడా చదవండి: PM Modi Birthday: ప్రధాని మోడీకి ట్రంప్ పుట్టినరోజు శుభాకాంక్షలు..

ఇదిలా ఉంటే ట్రంప్ యూకే పర్యటన సందర్భంగా చేదు అనుభవం ఎదురైంది. యూకేలోని విండ్సర్ కోటపై అధ్యక్షుడు ట్రంప్, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఉన్న ఫొటోలు.. వీడియో ఫుటేజ్ ప్రదర్శింపబడింది. విండ్సర్ కాజిల్ టవర్‌పై చాలా నిమిషాల పాటు నాలుగు చిత్రాలు దర్శనమిచ్చాయి. దీంతో లండన్ పోలీసులు సీరియస్‌గా తీసుకుని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇది నిరసనకారులు చేసిన పనిగా పోలీసులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆ ఇద్దరి నాయుకులకు అగ్ని పరీక్షలా మారిందా?

వైరల్ స్టంట్‌లకు పేరుగాంచిన లెడ్ బై డాంకీస్ గ్రూప్.. రాజకీయ నాయకులను టార్గెట్‌గా చేసుకుని ఇలా చేస్తుంటుంది. ఇందులో భాగంగా మంగళవారం ఈ చిత్రాలను ప్రదర్శించినట్లుగా గుర్తించింది. ట్రంప్ టూర్‌‌కు ముందు ఇలాంటి చిత్రాలు ప్రదర్శించడంపై బ్రిటన్ ప్రభుత్వం షాక్‌కు గురైంది. అంతేకాకుండా ట్రంప్-జెఫ్రీ కలిసి నృత్యం చేస్తున్న ఫుటేజ్‌ను కూడా ప్రదర్శించారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

విండ్సర్ కోటపై అనధికార కార్యకలాపాలను చాలా తీవ్రంగా పరిగణిస్తామని థేమ్స్ వ్యాలీ పోలీస్ చీఫ్ సూపరింటెండెంట్ ఫెలిసిటీ పార్కర్ తెలిపారు. అధికారులు వేగంగా స్పందించి ప్రొజెక్షన్‌ను ఆపి వేయించారని చెప్పారు. స్థానిక పోలీసులు వెంటనే నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ టూర్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమయ్యే సూచనలు ఉన్న నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా లైంగిక ఆరోపణలు కలిగిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నాయంటూ న్యూయార్క్ టైమ్స్ వరుస కథనాలు ప్రచురిస్తోంది. దీనిపై ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. తనపై, తన కుటుంబంపై దశాబ్దాలుగా అసత్య ప్రచారాలు వ్యాప్తి చేస్తోందని.. ఈ నేపథ్యంలో ఫ్లోరిడాలో రూ.1.32 లక్షల కోట్లకు దావా వేస్తున్నట్లు వెల్లడించారు.

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి వారిపై అఘాయిత్యాలకు పాల్పడినట్లుగా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఇలా రెండు దశాబ్దాల పాటు ఈ చీకటి వ్యవహారం నడిచింది. 2005లో ఈ సెక్స్ స్కామ్ బట్టబయలైంది. 2019, ఆగస్టులో అతడు జైల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అది ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. అయితే ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు సంబంధాలు ఉన్నట్లు అమెరికా పత్రికల్లో పలు కథనాలు వెలువడ్డాయి.

Exit mobile version