NTV Telugu Site icon

Trump: ట్రంప్ మరో కీలక నిర్ణయం.. స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై భారీగా టారిఫ్

Trump1

Trump1

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. న్యూఓర్లీన్స్‌లో ఎన్‌ఎఫ్‌ఎల్‌ సూపర్‌ బౌల్‌ కార్యక్రమానికి వెళ్తూ ట్రంప్‌ తన ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో మీడియాతో మాట్లాడారు. స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాల గురించి మంగళవారం, లేదా బుధవారం నాటికి క్లారిటీ వస్తుందని పేర్కొన్నారు. ఆ తర్వాతే అమల్లోకి వస్తాయని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Aero India 2025 : ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ప్రారంభం.. విన్యాసాలు ప్రదర్శిస్తున్న యుద్ధ విమానాలు

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మొదటి పాలన కాలంలో కూడా స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించారు. ఆ తర్వాత కెనడా, మెక్సికో, బ్రెజిల్‌ లాంటి వాణిజ్య భాగస్వాములకు వీటి నుంచి మినహాయింపునిస్తూ టారిఫ్‌ రహిత కోటాలను కల్పించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన బైడెన్‌ సర్కారు.. బ్రిటన్‌, జపాన్‌, ఐరోపా సమాఖ్యకు ఈ కోటాలను విస్తరించారు.

స్టీల్‌ ఉత్పత్తుల్లో అధిక శాతం కెనడా, బ్రెజిల్‌, మెక్సికో నుంచే ఎక్కువగా వస్తుంటాయి. ఇక అమెరికాకు అతిపెద్ద అల్యూమినియం సరఫరాదారుగా కెనడా నిలిచింది. 2024లో అగ్రరాజ్యం దిగుమతి చేసుకున్న మొత్తం అల్యూమినియంలో దాదాపు 79 శాతం కెనడా నుంచి వచ్చిందే. ఈ నేపథ్యంలో తాజా టారిఫ్‌లు ఈ దేశాలపైనే ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: PM Modi: పరీక్షా పే చర్చలో భాగంగా కాసేపట్లో విద్యార్థులకు చిట్కాలు చెప్పనున్న మోడీ