Trump Tariffs: భారత్‌కు 25 శాతం టారిఫ్.. పాకిస్తాన్‌కు మాత్రం ఊరట..
- సుంకాలతో ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న ట్రంప్..
- భారత్‌పై 25 శాతం, పాకిస్తాన్‌కు మాత్రం ఊరట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో ప్రపంచదేశాలను హడలెత్తిస్తున్నాడు. ఇప్పటికే భారత్ సహా పలు ప్రపంచ దేశాలపై భారీ సుంకాలు విధించాడు. భారత్ ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే, తాజాగా ట్రంప్ అధిక సుంకాలను విధిస్తూ ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేశాడు. 69 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై 10 శాతం నుంచి 41 శాతానికి పెరిగిన ఈ వాణిజ్య సుంకాలు ఏడు రోజుల్లో అమలులోకి రానున్నాయి.
సిరియాపై 41 శాతం, కెనడా నుండి అనేక వస్తువులపై 35 శాతం, బ్రెజిల్‌కు 50 శాతం, భారతదేశానికి 25 శాతం, తైవాన్‌కు 20 శాతం, స్విట్జర్లాండ్‌కు 39 శాతం వరకు సుంకాలు ఉన్నాయి. మరోవైపు పాకిస్తాన్ దిగుమతులపై సుంకాలను 29 శాతం నుంచి 19 శాతానికి తగ్గించడం కొసమెరుపు. మరికొంత మంది వాణిజ్య భాగస్వాములతో ఒప్పందాలు చర్చల స్థాయిలో ఉన్నాయని ట్రంప్ పరిపాలన అధికారులు చెబుతున్నారు. పరస్పర సుంకాలు అమలులోకి రావడానికి సిద్ధంగా ఉన్నందును మరిన్ని వాణిజ్య ఒప్పందాలు ప్రకటించాల్సి ఉందని వారు చెప్పారు.
Also Read
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
అమెరికా ప్రకారం, ఉత్తర అమెరికా వాణిజ్య ఒప్పందంలోకి వచ్చే కెనడియన్, మెక్సికన్ వస్తువులకు మినహాయింపులు అమలులో ఉన్నాయి. లాటిన్ అమెరికాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న బ్రెజిల్‌పై 50 శాతం సుంకాలను విధించారు. భారతదేశంలోని అగ్రికల్చర్ సెక్టార్‌లోకి అమెరికాను అనుమతించే విషయంలో భారత్ అడ్డు చెప్పింది. దీంతో 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు చెప్పారు. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోవైపు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.
Read Also: Washing Machine: టాప్ లోడ్ vs ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు.. ఏది బెస్ట్? ఎందుకు?
దేశాలు వాటిపై అమెరికా విధించిన సుంకాలు ఇలా ఉన్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ 15%
అల్జీరియా 30%
అంగోలా 15%
బంగ్లాదేశ్ 20%
బొలీవియా 15%
బోస్నియా మరియు హెర్జెగోవినా 30%
బోట్స్వానా 15%
బ్రెజిల్ 10%
బ్రూనై 25%
కంబోడియా 19%
కామెరూన్ 15%
చాడ్ 15%
కోస్టా రికా 15%
కోట్ డి`ఐవోయిర్ 15%
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 15%
ఈక్వెడార్ 15%
ఈక్వటోరియల్ గినియా 15%
ఫాక్లాండ్ దీవులు 10%
ఫిజి 15%
ఘనా 15%
గయానా 15%
ఐస్లాండ్ 15%
భారతదేశం 25%
ఇండోనేషియా 19%
ఇరాక్ 35%
ఇజ్రాయెల్ 15%
జపాన్ 15%
జోర్డాన్ 15%
కజకిస్తాన్ 25%
లావోస్ 40%
లెసోతో 15%
లిబియా 30%
లీచ్టెన్స్టెయిన్ 15%
మడగాస్కర్ 15%
మలావి 15%
మలేషియా 19%
మారిషస్ 15%
మోల్డోవా 25%
మయన్మార్ (బర్మా) 40%
మొజాంబిక్ 15%
నమీబియా 15%
నౌరు 15%
న్యూజిలాండ్ 15%
నికరాగ్వా 18%
నైజీరియా 15%
ఉత్తర మాసిడోనియా 15%
నార్వే 15%
పాకిస్తాన్ 19%
పాపువా న్యూ గినియా 15%
ఫిలిప్పీన్స్ 19%
సెర్బియా 35%
దక్షిణాఫ్రికా 30%
దక్షిణ కొరియా 15%
శ్రీలంక 20%
స్విట్జర్లాండ్ 39%
సిరియా 41%
తైవాన్ 20%
థాయిలాండ్ 19%
ట్రినిడాడ్ మరియు టొబాగో 15%
ట్యునీషియా 25%
టర్కీ 15%
ఉగాండా 15%
యునైటెడ్ కింగ్డమ్ 10%
వనాటు 15%
వెనిజులా 15%
వియత్నాం 20%
జాంబియా 15%
జింబాబ్వే 15%
తాజావార్తలు
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
-
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!