NTV Telugu Site icon

Donald Trump: ట్రంప్‌ని చంపేందుకు చివరి గంటల్లో షూటింగ్ ప్రాక్టీస్.. బుల్లెట్స్, నిచ్చెన కొనుగోలు..

Donald Trump

Donald Trump

Donald Trump: ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్న సందర్భంలో యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే నిందితుడు ట్రంప్‌పైకి కాల్పులు జరిపాడు. అయితే, అదృ‌ష్టవశాత్తు ట్రంప్ కుడి చెవిని తాకుతూ బుల్లెట్ వెల్లడంతో బతికిపోయాడు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా, ఒకరు మరణించారు. హత్యాయత్నానికి యత్నించిన నిందితుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు, ఘటన నుంచి ట్రంప్‌ని రెస్క్యూ చేశారు.

Read Also: IAS Puja khedkar: అర్ధరాత్రి పూజా ఇంటికి పోలీసులు.. సస్పెన్ష్‌గా దర్యాప్తు!

ఇదిలా ఉంటే, ట్రంప్‌ని హత్య చేసేందుకు నిందితుడు చివరి 48 గంటలు షూటింగ్ ప్రాక్టీస్ చేసినట్లుగా విచారణ అధికారులు చెప్పారు. క్రూక్స్ మొత్తం 50 రౌండ్ల బుల్లెట్స్, ఒక నిచ్చెనని కొనుగోలు చేశారని చెప్పారు. నిందితుడు తన చివరి రెండు రోజులు బాగానే గడిపాడని సీఎన్ఎన్ నివేదించింది. క్రూక్స్ తన స్వస్థలమైన బెతెల్ పార్క్‌లోని షూటింగ్ రేంజ్‌కి వెళ్లాడని, అక్కడే షూటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాతి రోజు 5 అడుగుల నిచ్చెనని కొనుగోలు చేశారని, దీని తర్వాత స్థానిక తుపాకీ దుకాణానికి వెళ్లి, కాల్పులకు ఉపయోగించిన రైఫిల్‌కి సంబంధించి బుల్లెట్లను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ రైఫిల్‌న నిందితుడు క్రూక్స్ తండ్రి 2013లో కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

దాడికి కొద్దిసేపటి ముందు క్రూక్స్ స్థానిక తుపాకీ దుకాణం నుంచి మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేసినట్లు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. దాడి రోజు సాయంత్రం తన స్వస్థలం నుంచి కారులో ట్రంప్ ర్యాలీ జరిగే బట్లర్‌కి వెళ్లాడు. నిచ్చెన ద్వారా సమీపంలోని భవనంపైకి నిందితుడు చేరాడు. ఆ తర్వాత ట్రంప్‌పై దాడికి తెగబడ్డాడు. క్రూక్స్ తీవ్రవాద భావజాలంతో ప్రేరేపించబడ్డాడా..? లేక ఎవరైనా కుట్రకు సహకరించారా..? అనే కోణంలో ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది. క్రూక్స్ చదివిన కాలేజీల్లో ఎక్వైరీ చేయగా, అతను అందరితో స్నేహపూర్వకంగా ఉంటాడని కొందరు చెప్పగా, కొందరు మాత్రం అతను స్కూల్‌లో వేధింపులకు గురైనట్లు తెలిపారు.

Show comments