Site icon NTV Telugu

Trump-Putin: ట్రంప్-పుతిన్ భేటీ ఆడంబరమేనా? నిపుణులు ఏమంటున్నారంటే..!

Trumpputin

Trumpputin

అలాస్కాలో ట్రంప్-పుతిన్ భేటీపై ఎన్నో అంచనాలు.. ఎన్నో ఊహాగానాలు వెలువడ్డాయి. ఇద్దరి సమావేశం తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఒక ముగింపు పలుకుతుందని ప్రపంచమంతా ఎదురుచూసింది. కానీ చివరికి ఇద్దరి భేటీ ‘తుస్’ మనిపోయింది. యుద్ధంపై ఒక ముగింపునకు రాకుండానే 3 గంటల సమావేశం ఆవిరైపోయింది. దీంతో అందరి అంచనాలు తల్లకిందులయ్యాయి.

ఇది కూడా చదవండి: BJP: రేపు బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక!

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు జరిపింది. కానీ ప్రయోజనం దక్కలేదు. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి పుతిన్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. అన్నట్టుగానే ఆగస్టు 15న అలాస్కాలో భేటీ అయ్యారు. ఇక వీరిద్దరి సమావేశంతో యుద్ధానికి ఒక ముగింపు లభిస్తుందని అంతా భావించారు. కానీ చివరికి యుద్ధంపై ఎలాంటి ఒప్పందం జరగకుండానే సమావేశం ముగియడం నిపుణులను, మేధావులను ఆశ్చర్యానికి గురి చేసింది. మరోసారి మాస్కోలో సమావేశం కావాలని ఇద్దరూ నిర్ణయం తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: SSMB 29 : సెట్స్ నుండి లీక్ అయిన మహేష్ బాబు – ప్రియాంక చోప్రా అరుదైన పిక్

2022 నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే ఇరు దేశాలు చాలా నష్టపోయాయి. దీంతో ట్రంప్-పుతిన్ భేటీతో యుద్ధానికి ఒక ముగింపు లభిస్తుందని భావించారు. చివరికి ఎలాంటి ఒప్పందం జరగకుండా సమావేశం ముగిసింది. ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మేలు జరుగుతుందని అంతా భావిస్తే.. చివరికి ‘తుస్’ మనిపించారు. ఇక ఇద్దరి భేటీ తర్వాత పుతిన్ మాట్లాడుతూ.. 2022లో ట్రంప్ అధికారంలో ఉండుంటే.. యుద్ధం జరిగేదే కాదన్నారు. ప్రస్తుతానికి ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిపారు. ఇక ట్రంప్ మాట్లాడుతూ.. యుద్ధం ముగింపునకు పుతిన్ ఇంకా నిర్ణయానికి రాలేదని పేర్కొన్నారు.

ఇక పుతిన్‌కు ట్రంప్ ఘనస్వాగతం పలికారు. కరచాలనం, చిరునవ్వుతో హృదయపూర్వక స్వాగతం పలికారు. ఇక పుతిన్‌కు స్వాగతం పలికే సమయంలో బీ-2 బాంబర్లు పైనుంచి వెళ్లాయి. వాటిని పుతిన్ ఆసక్తిగా తిలకించారు.

 

Exit mobile version