Site icon NTV Telugu

Trump-Meloni: మెలోని అందమైన అమ్మాయి.. అలాంటే అభ్యంతరం లేదు కదా? నవ్వులు పూయించిన ట్రంప్

Meloni33

Meloni33

అందమైన యువతి అని పిలిస్తే అభ్యంతరం లేదు కదా? అని మెలోనిని ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో మెలోని సహా వేదికపై ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఈజిప్టు వేదికగా సోమవారం గాజా శాంతి శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు హాజరయ్యారు. యూకే ప్రధాని స్టార్మర్, పాకిస్థాన్ ప్రధాని షరీఫ్, ఇటలీ ప్రధాని మెలోని.. ఇలా ఆయా దేశాధినేతలంతా పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Shashi Tharoor: మోడీ మంచి అవకాశాన్ని కోల్పోయారు.. శాంతి సదస్సుకు వెళ్లకపోవడాన్ని తప్పుపట్టిన శశిథరూర్

ఈ సందర్భంగా ట్రంప్ ప్రసంగిస్తూ మెలోని అందంపై ప్రశంసలు కురిపించారు. మెలోని అందమైన యువతి అని పేర్కొన్నారు. ఇలా పిలిస్తే నీకు అభ్యంతరం లేదు కదా? అని ట్రంప్ అనగానే మెలోని సహా అందరూ నవ్వుకున్నారు. అంతేకాదు మెలోని అందమైన నాయకురాలు కూడా అంటూ ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వేదికపై ఉన్నవాళ్లలో మెలోని ఒక్కతే మహిళ. దీంతో అందరిలో ఆమె ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఇక షరీఫ్ పక్కనే మెలోని నిలబడ్డారు.

ఇది కూడా చదవండి: Meloni: ట్రంప్ శాంతికర్త అంటూ షెహబాజ్ షరీఫ్ పొగడ్తలు.. మెలోని సంజ్ఞలు వైరల్

‘‘యునైటెడ్ స్టేట్స్‌లో ఒక మహిళ గురించి ‘అందమైన’ అనే పదాన్ని ఉపయోగిస్తే అది రాజకీయ జీవితానికి ముగింపు. కానీ నేను నా అవకాశాలను తీసుకుంటాను.’’ అని నవ్వుతూ మెలోని వైపు తిరిగి ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘‘మెలోని అద్భుతమైన నాయకురాలు అని కొనియాడారు. ఈజిప్టు రావడం గొప్ప విషయం. కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇటలీ ప్రజలంతా మెలోనిని గౌరవిస్తారు. ఎందుకంటే విజయవంతమైన రాజకీయ నాయకురాలు’’ అని ట్రంప్ కీర్తించారు.

ఇది కూడా చదవండి: INDIA Bloc: ఆర్జేడీ-కాంగ్రెస్ సీట్ల పంపకాలు!.. ఎవరికెన్ని స్థానాలంటే..!

ఇదిలా ఉంటే షరీఫ్ ప్రసంగం మొదలు పెట్టగానే ఆద్యంతం ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ట్రంప్ ప్రపంచ శాంతికర్త అంటూ ప్రశంసించారు. వెనుకనే ఉన్న ఇటలీ ప్రధాని మెలోని నోటిపై చేయి వేసుకుని ఆశ్చర్యపోయింది. చాలాసేపు వింతైన హావభావాలు వ్యక్తం చేశారు. భారతదేశం-పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపారని.. ఇప్పుడు గాజా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపారని.. ఇలా ప్రపంచంలో అనేక యుద్ధాలని ఆపారంటూ షరీఫ్ ప్రసంగిస్తుండగా ఇటలీ ప్రధాని మెలోని మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నిలబడిపోయారు. నోటిపై చేయి వేసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అలా ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

Exit mobile version