అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫొటో దిగడమంటే మామూలు విషయం కాదు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతాలో ఉంటారు. అలాంటిది ట్రంప్ దగ్గరకు వెళ్లి ఫొటో దిగడం అంటే ఆషామాషీ కాదు. అలాంటిది ట్రంప్‌తో ఫొటో దిగడమంటే సాధ్యమవుతుందా? అంటే కాదనే చెప్పొచ్చు. అలాంటిది రిపబ్లికన్ నేషనల్ కమిటీ ఒక బృహత్తరమైన అవకాశం కల్పించింది. ట్రంప్‌తో ఫొటో దిగే అవకాశాన్ని కల్పించింది. అయితే ఒక షరతు.. ఫొటో కోసం ధర నిర్ణయించారు. ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.
ఆగస్టు 27న హ్యూస్టన్‌లో రిపబ్లికన్ నేషనల్ కమిటీ.. ట్రంప్ కోసం ప్రత్యేక నిధుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో ట్రంప్‌తో ఫొటో దిగేందుకు రేట్ నిర్ణయించింది. ఏకంగా అక్షరాల భారత కరెన్సీ ప్రకారం రూ.85 లక్షలు ఫిక్స్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆహ్వాన పత్రిక చక్కర్లు కొడుతోంది. ధర చూసిన అమెరికన్లు నోరెళ్లబెడుతున్నారు. ఆశ పడితే మాత్రం జేబులు ఖాళీ అవ్వడం ఖాయం.
ఆహ్వానం ప్రకారం.. రిపబ్లికన్ నేషనల్ కమిటీ (RNC) ఆగస్టు 27న హ్యూస్టన్‌లో ట్రంప్ కోసం ప్రత్యేక నిధుల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో పాల్గొనేందుకు టికెట్ల ధరలు జంటకు 10,000 డాలర్లు (ఒక జంటకు రూ.9.5 లక్షలు)తో మొదలు పెట్టింది. ట్రంప్‌తో గ్రూప్ ఫొటో దిగేందుకు 88,600 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.85 లక్షలు) చెల్లించాల్సి ఉంటుందని ఆహ్వాన పత్రంలో పేర్కొంది. ఇక అత్యంత ఖరీదైన హోస్ట్ కమిటీ ప్యాకేజీ ధర 4,43,000 డాలర్లు (రూ.4.2 కోట్లు)గా నిర్ణయించింది.
ట్రంప్‌తో ఫొటో కోసం నిర్ణయించిన భారీ ధర ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. ధరను చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఫొటో కోసం ఇంత భారీ మొత్తాన్ని వసూలు చేయడమా? అంటూ సోషల్ మీడియా వేదికగా భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

