Site icon NTV Telugu

Trump: యూఎన్‌లో కుట్ర జరిగింది.. కారకుల అరెస్ట్‌కు ట్రంప్ ఆదేశాలు

Trump

Trump

ట్రంప్.. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు. ఈ హోదాలో చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. పక్కా నిఘా. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు ఉంటాయి. అలాంటి భద్రత కలిగిన ట్రంప్‌కు ఐక్యరాజ్యసమితిలో మాత్రం చేదు అనుభవాలు ఎదురయ్యాయి. సెప్టెంబర్ 23 నుంచి ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేవాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలుకు హాజరయ్యేందుకు ప్రథమ మహిళ మెలానియాతో కలిసి ట్రంప్ న్యూయార్క్‌లోని యూఎన్ కార్యాలయానికి వచ్చారు. పైకి వెళ్లేందుకు మెలానియా, ట్రంప్ ఎస్కలేటర్ ఎక్కారు. ఇద్దరూ ఎక్కగానే సడన్‌గాఎస్కలేటర్ ఆగిపోయింది. దీంతో ఇద్దరూ కూడా అవాక్కయ్యారు. ఒకింత షాక్‌కు గురయ్యారు. దీంతో చేసేదేమీలేక మెలానియా మెట్లు ఎక్కి వెళ్లిపోయారు. మెలానియా వెంట ట్రంప్ కూడా మెట్లు ఎక్కేసి వెళ్లిపోయారు. దీన్ని ఘోర అవమానంగా ట్రంప్ భావించారు. ఎస్కలేటర్ ఎందుకు ఆగిందంటూ చేతి సైగలు చేశారు.

ఇది కూడా చదవండి: Ladakh Violence: లడఖ్ హింస‌పై కేంద్రం ప్రత్యేక దృష్టి.. కీలక సమాచారం సేకరణ!

ఇదేదో పొరపాటున జరిగిందని సర్దుకుంటే.. అనంతరం ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో టెలిప్రాంప్టర్ కూడా పని చేయలేదు. ఇదిలా ఉండగా మాట్లాడుతున్న సమయంలో పూర్తిగా శబ్దం కూడా ఆగిపోయింది. ఇలా ఒకదాని వెంట ఒకటి ఉద్దేశపూర్వకంగా జరగడంతో దీని వెనుక కుట్ర దాగి ఉందని వైట్‌హౌస్ భావించింది. వెంటనే విచారణకు ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Off The Record : పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్సీల విషయంలో వైసీపీ వ్యూహం ఏంటి ?

అయితే తాజాగా ఈ మూడు పరిణామాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూఎన్‌లో జరిగిన చర్యలు చాలా దుర్మార్గపు సంఘటనలుగా పేర్కొన్నారు. ఈ మూడు సంఘటనలు తనకు వ్యతిరేకంగా జరిగిన కుట్రలుగా ట్రంప్ తెలిపారు. ఈ మూడు పరిణామాలు కారణంగా నిరాశలో ఉన్నట్లు చెప్పారు. యూఎన్‌లో పరిణామాలను సీక్రెట్ సర్వీస్ పరిశీలిస్తుందని వెల్లడించారు. కుట్రకు పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేయాలని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు. తాను మాట్లాడుతుండగా ఐక్యరాజ్యసమితిలో శబ్దం ఆగిపోయిందని, ఇయర్‌పీస్‌ల్లో తాను మాట్లాడే మాటలు వినబడలేదని.. ఇదే విషయాన్ని తన భార్య మెలానియా చెప్పిందని.. తాను చెప్పేది ఆమె వినలేనని చెప్పిందని ట్రంప్ గుర్తుచేశారు. ఇది ఏ మాత్రం యాదృచ్చికం కాదని.. ఈ మూడు సంఘటనలు ఉద్దేశపూర్వకంగానే జరిగాయని.. ఈ విషయంపై దర్యాప్తు కోరుతున్నట్లు తెలిపారు. ఎస్కలేటర్ నిలిపివేతకు సంబంధించిన భద్రతా టేపులను భద్రపరచాలని ఐక్యరాజ్యసమితికి ఆదేశించారు. సీక్రెట్ సర్వీస్ పరిశీలిస్తుందని చెప్పారు.

అయితే ఈ మధ్య ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు సరిగ్గా పని చేయడం లేదని తెలుస్తోంది. దీనికి నిధుల కొరతే కారణంగా తెలుస్తోంది. యూఎన్‌కు అత్యధికంగా అమెరికానే నిధులు కేటాయిస్తుంది. కానీ ఈ మధ్య ట్రంప్ ప్రభుత్వం సరిగ్గా నిధులు కేటాయించడం లేదని సమాచారం. దీంతోనే ఈ పరిస్థితులు తలెత్తినట్లుగా తెలుస్తోంది. అయితే యూఎన్‌ ఇబ్బందులు ట్రంప్‌కు తెలియజేసేందుకు సిబ్బంది ఈ మాదిరిగా చేసి ఉండొచ్చేమో!

 

Exit mobile version